News August 14, 2025
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాలేదా?

TG: బిల్లులు రాని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హౌసింగ్ కార్పొరేషన్ కీలక సూచన చేసింది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు మ్యాచ్ కాకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. అలాంటివారు వెంటనే ఆధార్ కార్డులో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని సూచించింది. ఇకపై ఆధార్ పేమెంట్ బ్రిడ్జి సిస్టం ద్వారానే చెల్లింపులు చేస్తామని తెలిపింది. కాగా లబ్ధిదారులు బిల్లుల స్టేటస్‌ను <
Similar News
News August 16, 2025
పెట్రోల్, డీజిల్ GST పరిధిలోకి రానట్లేనా?

GST <<17418489>>శ్లాబులను<<>> తగ్గిస్తామన్న కేంద్రం ప్రతిపాదనతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులను GST పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం ఇష్టపడట్లేదని జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం పెట్రోల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సెస్ వసూలు చేస్తున్నాయి. అన్నీ కలిపి పన్నులు 50% వరకు ఉన్నాయి. ఒకవేళ GSTలోకి తెస్తే 28% శ్లాబులోకి రావొచ్చు.
News August 16, 2025
రష్యాకు యుద్ధం ఆపే ఉద్దేశం లేదు: జెలెన్‌స్కీ

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు యుద్ధం ఆపే ఉద్దేశం లేనట్లుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెనెన్‌స్కీ పేర్కొన్నారు. ‘యుద్ధం ఆపబోతున్నాం అని మాస్కో నుంచి ఎలాంటి ఆర్డర్ రాలేదు. ఎలాంటి సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ట్రంప్‌తో భేటీ జరుగుతున్న రోజూ వాళ్లు మా ప్రజలను చంపుతూనే ఉన్నారు’ అంటూ జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. పుతిన్‌తో సీజ్ ఫైర్‌కు ట్రంప్ ఒప్పిస్తారా? ఇప్పుడు ప్రపంచ దేశాలన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఇదే.
News August 16, 2025
కాసేపట్లో భారీ వర్షాలు: TGiCCC

TG: కాసేపట్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ కమాండ్&కంట్రోల్ సెంటర్ హెచ్చరించింది. సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తెల్లవారుజామున 4 గంటల్లోపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ మేరకు ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజులు పంపింది.