News September 27, 2024
రేషన్‌కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు: మంత్రి

TG: రేషన్‌కార్డు లేని నిరుపేదలకూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈమేరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీలు అలాంటి అర్హులను గుర్తిస్తాయన్నారు. దసరా నాటికి ఆ కమిటీలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గ్రామస్థాయి కమిటీలో సర్పంచ్/పర్సన్ ఇన్‌ఛార్జి, గ్రామ కార్యదర్శి, ముగ్గురు సేవా కార్యకర్తలుంటారని తెలిపారు. అవసరమైతే ఇళ్ల సంఖ్య పెంచుతామన్నారు.
Similar News
News November 7, 2025
డికాక్ సూపర్ సెంచరీ.. ఒంటి చేత్తో గెలిపించాడు

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాక్‌తో జరిగిన రెండో వన్డేలో SA బ్యాటర్ క్వింటన్ డికాక్ శతకంతో చెలరేగారు. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డికాక్ 119 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 123* పరుగులు చేశారు. టోనీ(76), ప్రిటోరియస్(46) రాణించారు. కేవలం 40.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయ్యారు. దీంతో 1-1తో సిరీస్‌ను సమం చేశారు.
News November 7, 2025
పెద్ది నుంచి లిరికల్ కాదు.. వీడియో సాంగ్

టాలీవుడ్ ప్రేక్షకులను డైరెక్టర్ బుచ్చిబాబు ‘చికిరి చికిరి’ అంటూ ఊరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఫుల్ సాంగ్‌ను ఇవాళ ఉదయం 11.07కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అందరూ అనుకున్నట్లు లిరికల్ సాంగ్‌ను కాకుండా వీడియో సాంగ్‌నే రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పెద్ది చిత్రం నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ SMలో పేర్కొంది.
News November 7, 2025
నవంబర్ 7: చరిత్రలో ఈరోజు

*1858: స్వాతంత్ర్య సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ జననం
*1888: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి, భారత రత్న గ్రహీత సి.వి.రామన్(ఫొటోలో) జననం
*1900: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎంపీ ఎన్జీ రంగా జననం
*1954: నటుడు కమల్ హాసన్ జననం
*1971: డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ పుట్టినరోజు
*1981: హీరోయిన్ అనుష్క శెట్టి బర్త్‌డే
*జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం


