News January 31, 2025
ఇందిరమ్మ ఇళ్లు.. మొదట వారికే!
TG: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను మరోసారి పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశించింది. అనర్హుల పేర్లను తొలగించాలని సూచించింది. దరఖాస్తులను 3 కేటగిరీలుగా (L1, L2, L3) విభజించింది. L1లోకి సొంత స్థలం ఉండి ఇళ్లు లేని వాళ్లు, L2లోకి స్థలం, ఇళ్లు రెండూ లేని వాళ్లు, L3లోకి అద్దె/రేకులు/పెంకుటిళ్లలో ఉన్నవారు వస్తారు. తొలి దశలో L1 కేటగిరీ వారికి ఇళ్లు వస్తాయని సమాచారం.
Similar News
News January 31, 2025
పరువు తీశారు.. చనిపోతున్నా!
AP: గుడివాడకు చెందిన ఆటోడ్రైవర్ రావి సత్తిబాబు విస్తార్ ఫైనాన్స్ కంపెనీ వద్ద రూ.7.80 లక్షలు లోన్ తీసుకున్నారు. క్రమం తప్పకుండా EMI చెల్లించేవారు. భార్య అనారోగ్యం కారణంగా ఈ నెల కట్టలేకపోయారు. ఆ విషయం చెప్పినా వినిపించుకోని కంపెనీ ప్రతినిధులు ఇంటా, బయటా ఆయన పరువు తీశారు. అవమానం భరించలేకపోయిన ఆయన, తన చావుకు విస్తార్ ఫైనాన్స్ సంస్థే కారణమని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
News January 31, 2025
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపుపై IRDAI గుడ్‌న్యూస్
ఇన్సూరెన్స్ కంపెనీలకు IRDAI కీలక ఆదేశాలు ఇచ్చింది. సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్ వార్షిక ప్రీమియాన్ని 10% కన్నా ఎక్కువ పెంచొద్దని స్పష్టం చేసింది. ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఒకవేళ 10% కన్నా ఎక్కువ పెంచాలని భావించినా, ఈ స్కీములను రద్దు చేయాలనుకున్నా తమను కచ్చితంగా సంప్రదించాలని ఆదేశించింది. పరిమిత ఆదాయమే ఉండే వృద్ధులపై ఆర్థికభారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంది.
News January 31, 2025
ఎంపీ బన్సూరి స్వరాజ్‌కు కృతజ్ఞతలు: ‘తండేల్’ నిర్మాత
ఎంపీ బన్సూరి స్వరాజ్‌కు ‘తండేల్’ సినిమా నిర్మాత బన్నీ వాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఆమె తల్లి, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ పేరును తమ సినిమాలో వాడుకునేందుకు అనుమతినిచ్చారని ట్వీట్ చేశారు. 2017, 2018లో పాకిస్థాన్ జైళ్లలో చిక్కుకున్న మత్స్యకారులను తిరిగి తీసుకురావడంలో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని, అప్పటి నిజ జీవిత సంఘటనలను తమ మూవీలో చూపించినట్లు వాసు పేర్కొన్నారు.