News October 15, 2025

ఇండో-అమెరికన్ ఆష్లీ టెల్లిస్ అరెస్ట్

image

ఇండో అమెరికన్ ఆష్లీ టెల్లిస్(64)ను వర్జీనియాలో అరెస్టు చేశారు. ఆయన US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌లో సీనియర్ అడ్వైజర్‌గా ఉన్నారు. ఆయన జాతీయ రక్షణకు సంబంధించి టాప్ సీక్రెట్స్ దొంగిలించారని, చైనా అధికారులను కలిశారని ఆరోపణలు ఉన్నట్లు US మీడియా పేర్కొంది. ఈయన ముంబైలో జన్మించారు. ఆష్లీ టెల్లిస్ విదేశాంగ విధాన నిపుణుడు, వ్యూహకర్త. అంతర్జాతీయ భద్రత, రక్షణ, ఆసియా వ్యూహాత్మక అంశాలపై విశేష ప్రావీణ్యం ఉంది.

Similar News

News October 15, 2025

20 మంది మృతి.. పరిహారం ప్రకటించిన ప్రధాని

image

రాజస్థాన్‌లో జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్‌కు వెళ్తున్న బస్సు <<18008110>>దగ్ధమై<<>> 20 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరో 16 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

News October 15, 2025

ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చి.. కొడుకుకు తండ్రి గుణపాఠం!

image

TG: తన బాగోగులు చూసుకోని కొడుకుకు సరైన గుణపాఠం చెప్పాడా తండ్రి. హన్మకొండ(D) ఎల్కతుర్తి మాజీ MPP శ్యాంసుందర్ రూ.3Cr విలువైన మూడెకరాల భూమిని ప్రభుత్వానికి రాసిచ్చారు. ప్రభుత్వ స్కూల్/ కాలేజీ కట్టి తన భార్య పేరు పెట్టాలని కోరారు. భార్య మరణించినప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆయనను కొడుకు రంజిత్ రెడ్డి చేరదీయలేదు. పైగా కొంత ఆస్తి తన పేరిట రాయించుకొని దాడి చేశారు. దీంతో శ్యాంసుందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

News October 15, 2025

ఆవు పేడతో నెలకు రూ.25వేల ఆదాయం

image

జీవితంలో ఎదగాలనే తపన ఉంటే ఆవు పేడతోనూ అద్భుతాలు చేయొచ్చని నిరూపిస్తున్నారు మధ్యప్రదేశ్‌ సాగర్ ప్రాంత మహిళలు. పేడతో కుందులు, బొమ్మలు, ల్యాంప్స్, గోడ గడియారాల లాంటివి తయారు చేసి విక్రయిస్తున్నారు. కొన్ని వస్తువులను విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా సగటున ₹25K వరకు సంపాదిస్తున్నారు. పండుగ సమయాల్లో ఈ మొత్తం ₹80వేలకు చేరుతోంది.
* రోజూ మహిళల స్ఫూర్తిదాయక కథనాల కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.