News August 2, 2024

ఇండో- US స్పేస్ మిషన్‌కు ప్రధాన వ్యోమగామి ఎంపిక

image

ఇండో-యూఎస్ సంయుక్తంగా చేపడుతున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ మిషన్‌కు ప్రధాన వ్యోమగామిగా శుభాన్షు శుక్లాను ఇస్రో ఎంపిక చేసింది. ఈయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో 1985లో జన్మించారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్‌‌లో ఫైటర్ కాంబాట్ లీడర్‌, పైలట్‌గా పని చేస్తున్నారు. అలాగే బ్యాక్ అప్ ఆస్ట్రొనాట్‌గా కేరళకు చెందిన ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను ఇస్రో ఎంపిక చేసింది.

Similar News

News October 23, 2025

ధాన్యం కొనుగోళ్లకు మార్గదర్శకాలు జారీ

image

AP: 51 లక్షల టన్నుల ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రైతులకు నూటికి నూరుశాతం మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఈ-పంట డేటా ప్రకారం ముందే ధాన్యం కొనుగోలు చేయాలని నిర్దేశించింది. ఏ మిల్లుకు ధాన్యం పంపాలనే స్వేచ్ఛను రైతులకు కల్పించింది. ఖరీఫ్ ధాన్యం క్వింటాకు సాధారణ రకానికి రూ.2369, గ్రేడ్-A రకానికి రూ.2,389 మద్దతు ధర కల్పించింది.

News October 23, 2025

నెలసరిలో ఏం తినాలంటే..?

image

చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో క్రేవింగ్స్ వస్తున్నాయని తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు. అయితే వీటివల్ల నెలసరి సమస్యలు మరింత పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ సమయంలో చికెన్, బటానీలు, బీన్స్, పప్పులు, టోఫు, అంజీరా, ఎండుద్రాక్ష, బ్రోకలీ, ఆకుకూరలు, పిస్తా, గుమ్మడి విత్తనాలు, స్ట్రాబెర్రీ, కర్బూజ, ఆప్రికాట్, బ్రోకలీ, ఆకుకూరలు, నిమ్మ, నారింజ, బత్తాయి, పీచుపదార్థాలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు.

News October 23, 2025

వేదకాలపు జ్ఞానాన్ని అందించే ‘బ్రాహ్మణాలు’

image

వేదాలలో యజ్ఞాల గురించి వివరించే భాగాలను బ్రాహ్మణాలు అని అంటారు. ఇవి యజ్ఞాల నిర్వహణ, నియమ నిబంధనలు, మంత్రాల అర్థాలను వివరిస్తాయి. వేద కాలంలో దైవారాధన అంటే యజ్ఞాలే కాబట్టి వాటిని లోతుగా అర్థం చేసుకోవడానికి ఇవి మార్గదర్శకాలుగా నిలిచాయి. నచికేతుడు దీన్నుంచే అగ్నివిద్యను నేర్చుకుని మోక్షం పొందాడని వాక్కు. జ్యోతిష వివరాలకు మూలం, వేదకాలపు జ్ఞానాన్ని అందించే ముఖ్య గ్రంథాలు కూడా బ్రాహ్మణాలే. <<-se>>#VedikVibes<<>>