News January 24, 2025

భారత్ చేరుకున్న ఇండోనేషియా అధ్యక్షుడు

image

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంటో భారత పర్యటనకు వచ్చారు. 76వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని భారత్ ఆహ్వానించగా, ఆయన కొద్దిసేపటి కిందటే ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ఇండోనేషియా అధ్యక్షుడి రాక రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ వెల్లడించింది.

Similar News

News January 29, 2026

తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నారా? అసలు కారణమిదే..

image

ఎంత తింటున్నాం అనేదాని కంటే శరీరం దాన్ని ఎలా ఖర్చు చేస్తోందనేదే ముఖ్యం. పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఖర్చయ్యే శక్తిని Basal Metabolic Rate (BMR) అంటారు. కొందరికి ఇది పుట్టుకతోనే వేగంగా ఉంటుంది. మరికొందరికి నెమ్మదిగా ఉంటుంది. మజిల్ మాస్ ఎక్కువగా ఉన్నవాళ్లలో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కూడా ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. నిద్రలేమి, స్ట్రెస్, హార్మోన్ల ఇమ్‌బ్యాలెన్స్ వల్ల కూడా బరువు పెరుగుతారు.

News January 29, 2026

కొత్తగా ఇల్లు కడుతున్నారా? ఈ నియమం పాటించండి..

image

కొత్తగా గృహ నిర్మాణం చేస్తున్నవారు పునాదిని ఎత్తుగా నిర్మించుకోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ప్రధాన రహదారి కంటే ఇంటి అడుగు భాగం 3-5 అడుగుల ఎత్తులో ఉండాలంటున్నారు. ‘రాబోయే రోజుల్లో రోడ్లు ఎత్తు పెరిగి, వర్షపు నీరు, మురుగు నీరు ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంది. వాస్తు రీత్యా కూడా ఇల్లు రోడ్డు కంటే పల్లంలో ఉండకూడదు. అందుకే దూరదృష్టితో పునాదిని ఎత్తుగా నిర్మించాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 29, 2026

రేపు రాలేను, ఎర్రవల్లి ఫాంహౌస్‌కు రండి: కేసీఆర్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ బదులిచ్చారు. ముందే షెడ్యూల్ అయిన మున్సిపల్ ఎలక్షన్ కార్యక్రమాల వల్ల రేపు విచారణకు హాజరు కాలేనని పోలీసులకు తెలిపారు. మరో తేదీన తనను ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే విచారించాలని విచారణ అధికారిని కోరారు. మాజీ సీఎంగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని తెలిపారు. భవిష్యత్తులో జారీ చేసే నోటీసులను కూడా ఎర్రవల్లికే పంపాలని పేర్కొన్నారు.