News August 23, 2024

‘ఇంద్ర’ రీరిలీజ్.. ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

image

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా రీరిలీజైన ‘ఇంద్ర’ సినిమా అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 3.05 కోట్లు వచ్చినట్లు వైజయంతి ఫిల్మ్స్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 385 థియేటర్లలో ఈ సినిమాను రీరిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, హీరోలు సైతం స్పెషల్ షోలకు హాజరై సందడి చేస్తున్నారు. మీరూ ‘ఇంద్ర’ చూసేందుకు వెళ్లారా?

Similar News

News March 7, 2026

రాములోరి కళ్యాణం.. టికెట్ల రేట్లు ఇవే

image

TG: భద్రాచలంలో ఈ నెల 19 నుంచి APR 2 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లో స్వామివారి కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తుల కోసం <>ఆన్‌లైన్‌లో<<>> టికెట్లు అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం వెల్లడించింది. కళ్యాణానికి రూ.150 నుంచి రూ.7,500 మధ్య, పట్టాభిషేకానికి రూ.100-రూ.1,500 మధ్య టికెట్లు ఉన్నాయని తెలిపింది.

News March 7, 2026

ఇండియన్ బిలియనీర్ల సంపద రూ.112 లక్షల కోట్లు

image

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2026 ప్రకారం బిలియనీర్ల సంఖ్య 4,020కి చేరింది. గతేడాదితో పోలిస్తే 578 మంది పెరిగారు. 1,100 బిలియనీర్లతో చైనా టాప్‌లో ఉండగా, ఆ తర్వాత US(1,000), IND(308) ఉన్నాయి. ఇండియన్ బిలియనీర్ల సంపద ₹112L Cr. ఇక ఎలాన్ మస్క్ $792Bn ఆస్తితో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఆ తర్వాత జెఫ్ బెజోస్-అమెజాన్($300Bn), లారీ పేజ్-ఆల్ఫాబెట్($271Bn), లారీ ఎల్లిసన్-ఒరాకిల్($267Bn) ఉన్నారు.

News March 7, 2026

WC ఫైనల్‌లో గెలిచేది ఇండియానే: ChatGpt

image

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 WC <<19308021>>ఫైనల్‌లో<<>> గెలుపెవరిదో ఏఐ ఏజెంట్లు ChatGpt & Gemini ప్రిడిక్ట్ చేశాయి. NZతో జరిగే ఈ మ్యాచులో సొంతగడ్డపై ఇండియా సత్తా చూపిస్తుందని, సూర్యకుమార్ ట్రోఫీ లిఫ్ట్ చేస్తారని పేర్కొన్నాయి. ‘స్పిన్నర్స్ & బ్యాటర్లకు పిచ్ అనుకూలంగా ఉంది. ప్రేక్షకుల వల్ల ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుంది. NZ 170 స్కోర్ చేయగలదు. IND ఈజీగా ఛేజ్ చేస్తుంది’ అని తెలిపాయి.