News August 18, 2024

రేపు ఇంద్ర’గిరి’ ప్రదక్షిణ

image

AP: శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 19న విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. సోమవారం ఉ.5.55 గం.కు ఘాట్‌రోడ్డు ప్రారంభంలోని శ్రీకామథేను ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. కుమ్మరిపాలెం, విద్యాధరపురం, నాలుగు స్తంభాలు, సితారా జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్ రావునగర్, చిట్టినగర్, కేటీ రోడ్డు, బ్రాహ్మణ వీధి మీదుగా గిరి ప్రదక్షిణ జరగనుంది.

Similar News

News January 22, 2025

‘సెంచరీ’ కొట్టేందుకు షార్ సన్నద్ధం

image

AP: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వందో ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ఇస్రో ఇక్కడి నుంచి GSLV- F15 ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయోగానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వందో ప్రయోగం అరుదైన మైలురాయి కావడంతో PM మోదీ హాజరవుతారని సమాచారం.

News January 22, 2025

ఏంటీ ‘బర్త్ టూరిజం’?

image

పిల్లలకు US పౌరసత్వం లభించాలనే ఉద్దేశంతో చాలామంది ఇతర దేశాల మహిళలు కాన్పు సమయానికి అక్కడికి వెళ్తుంటారు. దీన్నే ‘బర్త్ టూరిజం’ అంటారు. US అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ ఈ విధానానికి స్వస్తి పలికారు. బిడ్డకు జన్మనిచ్చే సమయానికి పేరెంట్స్ అమెరికా పౌరులు కాకపోయినా, తండ్రి లేదా తల్లి శాశ్వత నివాసి కాకపోయినా, తాత్కాలిక వీసాపై నివాసం ఉన్నా.. వారికి పుట్టబోయే బిడ్డకు జన్మత: అక్కడి పౌరసత్వం వర్తించదు.

News January 22, 2025

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. కర్నూలు వాసులు మృతి

image

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు మరణించారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తుండగా రాయచూరు జిల్లా సింధనూరు వద్ద టైర్ పంక్చర్ కావడంతో తుఫాన్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులుగా గుర్తించారు.