News September 27, 2024

మిజోరాం గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డికి అదనపు బాధ్యతలు

image

TG: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డిని మిజోరాం గవర్నర్‌గా నియమించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. దీంతో ఇంద్రసేనారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన ఇంద్రసేనారెడ్డి గతంలో 3 సార్లు MLAగా, BJP రాష్ట్ర అధ్యక్షుడిగాను సేవలందించారు. ఇటు హరిబాబు గతంలో విశాఖ BJP ఎంపీగా పని చేశారు.

Similar News

News December 3, 2025

కామారెడ్డి కలెక్టరేట్‌లో దివ్యాంగుల దినోత్సవం

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సివిల్ జడ్జ్ నాగరాణి పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్లు, సహాయక పరికరాలు, నైపుణ్యాభివృద్ధి, లోన్ల వంటి పథకాలను వివరించారు. ఈ ఏడాది స్కూటీలు, లాప్‌టాప్‌లు, ట్రైసైకిళ్లు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 28 మందికి లోన్లు, 15 మందికి వివాహ ప్రోత్సాహకంగా రూ.15 లక్షలు మంజూరు చేశారు.

News December 3, 2025

రేవంత్ క్షమాపణలు చెప్పాలి: కిషన్ రెడ్డి

image

TG: హిందూ దేవుళ్లను సీఎం రేవంత్ అవమానించేలా మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. CM రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి ఉందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు సీఎం రేవంత్ హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని ఆరోపించారు.

News December 3, 2025

లింగ భైరవి దేవత గురించి మీకు తెలుసా?

image

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శక్తివంతమైన దేవీ స్వరూపమే ‘లింగ భైరవి’. తాంత్రిక యోగంలో అత్యంత శక్తిమంతమైన ‘భైరవి’ రూపమే లింగాకారంలో ఉండటం వలన దీనిని లింగభైరవి అని పిలుస్తారు. కోయంబత్తూరులో ఈ ఆలయం ఉంది. భక్తులు తమ జీవితంలో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత, ఆరోగ్యం, వ్యాపారం కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు. భైరవి సాధనతో భావోద్వేగ బుద్ధిని పెరుగుతుందని నమ్మకం.