News February 28, 2025
ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్: శ్రీధర్‌బాబు

తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్కులను మహిళల కోసం ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10శాతం ప్రత్యేకంగా కేటాయిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలు ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఫిక్కీలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రైజెస్ సదస్సులో వెల్లడించారు.
Similar News
News February 28, 2025
మూడు మ్యాచ్‌ల్లో వరుణుడిదే గెలుపు

ఛాంపియన్స్ ట్రోఫీలో 3 మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. ఈ నెల 25న ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్, నిన్న పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లు వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దవగా, ఇవాళ మధ్యలో వర్షం కురవడంతో అఫ్గానిస్థాన్-ఆసీస్ మ్యాచ్ కూడా రద్దైపోయింది. దీంతో పాకిస్థాన్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల్లో వరుణుడే విజయం సాధించాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
News February 28, 2025
రోజంతా కూర్చొని పనిచేస్తున్నారా?

ప్రస్తుతం చాలా మంది ఒకేచోట 9-12 గంటలు కూర్చొని పనిచేయాల్సి వస్తోంది. అయితే, ఇలా ఎక్కువసేపు కూర్చోవడం ప్రమాదకరమని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో చిత్తవైకల్యం, స్ట్రోక్, ఆందోళన, నిరాశతో పాటు నిద్రలేమి సమస్యలొస్తాయని పేర్కొంది. ఇలాంటి జాబ్స్ చేసేవారు శారీరక వ్యాయామం చేయడం వల్ల ఈ ప్రమాదాల నుంచి బయటపడొచ్చని సూచించింది. ఈ అధ్యయనంలో 73,411 మంది పాల్గొన్నారు.
News February 28, 2025
శివరాత్రి వేళ రూ.కోటి దాటిన రాజన్న ఆలయ ఆదాయం

మహాశివరాత్రి రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ.1.31 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదాల ద్వారా రూ.57.12లక్షల ఆదాయంరాగా కోడె మెుక్కుల ద్వారా రూ.45.83లక్షలు వచ్చిందని పేర్కొన్నారు. స్వామివారిని 2లక్షల 60 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు.