News July 26, 2024
వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తల్ని తరిమేశారు: CBN

AP: ఏపీకి పునర్వైభవాన్ని తీసుకొస్తామని గత ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా CM చంద్రబాబు అన్నారు. ‘వైసీపీ హయాంలో అన్ని రంగాలు నష్టపోయాయి. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. అప్పులు పెరిగిపోయాయి. పారిశ్రామికవేత్తలను తరిమేశారు. కేంద్ర పథకాల నిధులను సరిగ్గా వినుయోగించుకోలేకపోయారు. కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు, నిత్యావసరాల ధరలను పెంచేశారు. చెత్తపైనా పన్ను వేశారు’ అని మండిపడ్డారు.
Similar News
News December 5, 2025
పోస్టల్ బ్యాలెట్ అందజేయాలి: అదనపు కలెక్టర్ నగేష్

పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా ఓటింగ్ సౌకర్యం కల్పించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశమై, వారికి కేటాయించిన విధులను సమర్థంగా నిర్వహించేందుకు తగిన సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.
News December 5, 2025
TG న్యూస్ రౌండప్

* కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌పై అభిప్రాయాలు సేకరించేందుకు రేపు తెలంగాణ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి KTR హాజరవుతారు: బోయినపల్లి వినోద్
* కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్ఛార్జ్ VCగా డా.రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
* HYD శామీర్‌పేటలో ఓ కారు టైర్లు, సీట్ల కింద ₹4Cr నగదును పోలీసులు గుర్తించారు. హవాలా ముఠాను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
News December 5, 2025
గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్‌ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.


