News May 9, 2024

మంగళగిరికి పరిశ్రమలు తీసుకొస్తా: లోకేశ్

image

AP: మంగళగిరి ప్రజల జీవన ప్రమాణాలు మారుస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ‘ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తా. దేశంలోనే ఎక్కువ అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మంగళగిరిని మారుస్తా. ఓటు వేసే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఎం జగన్, వైసీపీ నేతల మాటలు నమ్మొద్దు. ప్రతి హామీనీ నెరవేర్చే బాధ్యతను నేను వ్యక్తిగతంగా తీసుకుంటా’ అని వెల్లడించారు.

Similar News

News December 24, 2024

కాకినాడ పోర్టులో అక్రమాల కేసు.. కె.వి.రావు పిటిషన్

image

AP: కాకినాడ పోర్టులో అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోర్టు మాజీ యజమాని కె.వి.రావు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. అటు ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 31కి వాయిదా పడింది. అప్పటివరకు ఆయనపై చర్యలు వద్దని, కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా సీ పోర్టును అక్రమంగా రాయించుకున్నారని విక్రాంత్‌పై ఆరోపణలొచ్చాయి.

News December 24, 2024

పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

image

కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. కేరళ గవర్నర్‌గా రాజేంద్ర ఆర్లేకర్, మిజోరం గవర్నర్‌గా విజయ్‌కుమార్ సింగ్, ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, బిహార్ గవర్నర్‌గా ఆరిఫ్ అహ్మద్, మణిపుర్ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది.

News December 24, 2024

టీమ్ ఇండియా సూపర్ విక్టరీ

image

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు విజయం సాధించింది. 115 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. 359 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్ 243 రన్స్‌కు ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ (106) అద్భుత శతకం బాదారు. కానీ మిగతా బ్యాటర్లు ఆమెకు సహకారం అందించలేకపోయారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 3, ప్రతిక రావల్, సాధు, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు.