News March 21, 2025

UPI పేమెంట్స్‌ సబ్సిడీ ఎత్తివేతపై ఇండస్ట్రీ ఆందోళన

image

రూపే డెబిట్ కార్డులకు GOVT సబ్సిడీ విత్‌డ్రా చేసుకోవడంపై డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీ ఆందోళన చెందుతోంది. ఏటా రూ.500-600CR మేర నష్టం తప్పదని అంచనా వేస్తోంది. FY25లో స్మాల్ మర్చంట్స్ UPI పేమెంట్స్‌‌కే కేంద్రం రూ.1500CR కేటాయించింది. గత ఏడాదీ ఇండస్ట్రీ రూ.5500 కోట్లను ఆశించగా రూ.3,681CR ఇవ్వడం గమనార్హం. జీరో MDR వల్ల రూపే కార్డులపై వచ్చే నష్టాన్ని బ్యాంకులు, Fintechsకి కేంద్రం సబ్సిడీగా ఇస్తుంది.

Similar News

News March 28, 2025

ఓటీటీలోకి వచ్చేసిన 4 కొత్త సినిమాలు

image

ఇవాళ నాలుగు కొత్త మూవీలు OTTల్లో రిలీజయ్యాయి. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, రీతూ వర్మ కాంబోలో తెరకెక్కిన ‘మజాకా’ సినిమా నేటి నుంచి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. షాహిద్ కపూర్, పూజా హెగ్డే కాంబోలో తెరకెక్కిన ‘దేవ’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. ఆది పినిశెట్టి హీరోగా నటించిన ‘శబ్దం’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. తమిళ నటుడు జీవా నటించిన ‘అగత్యా’ సన్ నెక్ట్స్‌లో విడుదలైంది.

News March 28, 2025

వక్ఫ్ బోర్డును నాశనం చేసేందుకే సవరణ బిల్లు: అసదుద్దీన్

image

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ‘మతపరమైన అంశాల్లో ముస్లింల పాత్ర లేకుండా చేసేందుకు, వక్ఫ్ బోర్డును సమూలంగా నాశనం చేసేందుకు కేంద్రం వక్ఫ్ బిల్లులో సవరణలు తీసుకొస్తోంది. ఒక్క ముస్లిం MP, మంత్రి లేని ఈ ప్రభుత్వాన్ని మేం ఎలా నమ్మగలం? ముస్లింలకు టికెట్లు కూడా ఇవ్వరు. పైగా బుల్డోజర్లతో ఇళ్లు కూలగొడుతుంటారు’ అని విమర్శించారు.

News March 28, 2025

SHOCKING: కూతురిని ప్రేమించాడని..

image

TG: రాష్ట్రంలో పరువు హత్య కలకలం రేపింది. తన కూతురిని ప్రేమించాడని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పురితోటలో సాయికుమార్ అనే యువకుడిని అమ్మాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు. కూతురును ప్రేమించొద్దని హెచ్చరించినా వినలేదని నిన్న రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సాయికుమార్‌పై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

error: Content is protected !!