News September 21, 2024

INDvBAN: వరుణుడి పలకరింపు

image

భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న చిదంబరం స్టేడియంలో రాత్రి, తెల్లవారుజామున వర్షం కురిసింది. దీంతో మైదానంపై కవర్స్ కప్పారు. ప్రస్తుతం వర్షం లేకపోవడంతో కవర్స్‌ను తొలగించారు. ఆటగాళ్లు గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. అటు ఇప్పటికే 321 రన్స్ ఆధిక్యంలో ఉన్న భారత భారీ స్కోర్ చేస్తే ఈరోజు మ్యాచ్‌ను గెలిచే ఛాన్స్ ఉంది.

Similar News

News November 14, 2025

ట్రంప్‌కు క్షమాపణలు చెప్పిన BBC

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వీడియోను తప్పుగా ఎడిట్ చేసినందుకు ప్రముఖ మీడియా సంస్థ <<18245964>>BBC<<>> ఆయనకు క్షమాపణలు చెప్పింది. వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పేర్కొంది. అయితే పరువునష్టం చెల్లించాలన్న ట్రంప్ డిమాండ్‌ను తిరస్కరించింది. తాము ఉద్దేశపూర్వకంగా వీడియో ఎడిట్ చేయలేదని స్పష్టం చేసింది. ట్రంప్ డాక్యుమెంటరీని తిరిగి ప్రసారం చేసే ఉద్దేశం తమకు లేదని బీబీసీ న్యాయవాది తెలిపారు.

News November 14, 2025

‘జూబ్లీ’ రిజల్ట్స్: ఉదయం 8 గంటలకు కౌంటింగ్..

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఉ.8గంటలకు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 58 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని, ఎప్పటికప్పుడు ఫలితాలను EC వైబ్‌సెట్‌లో అప్డేట్ చేస్తామని అధికారులు తెలిపారు. ఒక్కో రౌండ్‌కు 45 నిమిషాలు పట్టనుంది.

News November 14, 2025

బిహార్ కౌంటింగ్.. వీడనున్న సస్పెన్స్!

image

బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలతో పలు రాష్ట్రాల్లోని ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. బిహార్‌లో మొత్తం 2,616 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 38 జిల్లాల్లోని 46 సెంటర్లలో కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపునకు ఈసీ 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు.