News October 16, 2024
INDvNZ: వరుణుడు జాలి చూపిస్తాడా..?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య రేపు జరిగే టెస్టు మ్యాచ్కు వరుణుడి ముప్పు ఉంది. మంగళవారం వాన ధాటికి ఇరు జట్లూ నెట్ ప్రాక్టీస్ కూడా చేయలేకపోయాయి. ‘వెదర్.కామ్’ ప్రకారం రేపు భారీ వర్షం పడటానికి 93శాతం అవకాశం ఉంది. వచ్చే 5 రోజులూ వర్షపాతం ఛాన్స్ ఉంది. అయితే, చిన్నస్వామి గ్రౌండ్ దేశంలోనే అత్యంత వేగంగా ఆరిపోయే గ్రౌండ్ కావడంతో అభిమానులు మ్యాచ్పై ఆశలు పెట్టుకున్నారు.
Similar News
News November 22, 2025
‘మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం లక్ష్యం’

దేశ ప్రగతి మహిళల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు ఏర్పాటుతో పాటు పారిశ్రామిక అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.
News November 22, 2025
మహిళలు గంధం రాసుకునేది ఎందుకంటే?

ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు చుట్టాలతో, పెద్దవారితో ఆప్యాయంగా, వినయంగా మాట్లాడాల్సిన బాధ్యత ఇల్లాలుపై ఉంటుంది. అయితే కొందరు మహిళల మాటతీరు గట్టిగా ఉంటుంది. శుభకార్యాలప్పుడు అతిథులు ఈ మాటతీరును ఇబ్బందిగా భావిస్తారు. అందుకే గొంతుపై గంధం రాస్తారు. ఇలా రాస్తే గొంతు సరళంగా, సున్నితంగా మారి మాటతీరు తియ్యగా, వినస్రవ్యంగా మారుతుందని నమ్మేవారు. స్త్రీ రూపానికి తగిన మృదువైన స్వరం ఉండాలని ఇలా చేశారు.
News November 22, 2025
కోర్టులో రహస్య చిత్రీకరణపై చర్యలు తీసుకోవాలి: YCP మాజీ MLA

AP: CBI కోర్టు జడ్జి ముందు YS జగన్ నిలబడి ఉండగా రహస్యంగా వీడియో చిత్రీకరించి కుట్రతో వైరల్ చేస్తున్నారని YCP మాజీ MLA సుధాకర్బాబు విమర్శించారు. దీనిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. జగన్ ఎక్కడికెళ్లినా వేలాది మంది వస్తుండడంతో అక్కసుతో ఇలా వ్యక్తిత్వ హననానికి దిగజారారని మండిపడ్డారు. CBN జైల్లో ఉండగా ఫొటోల వంటివీ బయటకు రాకుండా నాటి జగన్ ప్రభుత్వం ఆయన గౌరవాన్ని కాపాడిందన్నారు.


