News November 28, 2024

INDvsAUS: పింక్ బాల్ టెస్టు.. భారత్ రికార్డు ఇదే

image

AUSపై తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ రెండో మ్యాచ్‌పై దృష్టిసారించింది. డిసెంబర్ 6-10 మధ్య ఆడిలైడ్ వేదికగా డే-నైట్ టెస్టు పింక్ బాల్‌తో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30కు మ్యాచ్ మొదలవనుంది. స్టార్‌స్పోర్ట్స్, డిస్నీ+హాట్ స్టార్‌లో వీక్షించవచ్చు. స్వదేశంలో 3 డే-నైట్ టెస్టుల్లో బంగ్లా, ఇంగ్లండ్, శ్రీలంకపై భారత్ గెలవగా ఆడిలైడ్‌లో ఆసీస్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు అక్కడే మ్యాచ్ జరగనుంది.

Similar News

News December 5, 2025

‘పుష్ప-2’కు ఏడాది.. అల్లుఅర్జున్ స్పెషల్ ట్వీట్

image

‘పుష్ప2’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ప్రేమ తమకు మరింత ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిత్రాన్ని అద్భుతంగా మార్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కెప్టెన్’ సుకుమార్ సహా చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పారు. ‘పుష్ప’గా ఈ 5ఐదేళ్ల ప్రయాణం తన జీవితంలో మరువలేనిదని కొనియాడారు.

News December 5, 2025

ఏపీలో తొలి సోలార్ వేఫర్ యూనిట్: నారా లోకేశ్

image

AP: దేశంలోనే తొలి సోలార్ ఇంగోట్ వేఫర్ తయారీ యూనిట్ ఏపీలో ఏర్పాటవుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. అనకాపల్లిలో ReNewCorp రూ.3,990 కోట్ల పెట్టుబడితో 6GW సామర్థ్యంతో ఈ యూనిట్‌ను స్థాపించనున్నట్లు ‘X’ వేదికగా వెల్లడించారు. CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో కుదిరిన MoU ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని పేర్కొన్నారు.

News December 5, 2025

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో హెడ్ SeMT, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE/B.Tech/BCA/BSc(IT)/BSc(CS), M.Tech/MS/MBA/MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://ora.digitalindiacorporation.in