News September 27, 2024

INDvsBAN: మ్యాచ్‌కు వర్షం అంతరాయం

image

కాన్పూర్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ నిలిచిపోగా అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. ఈ సమయానికి 26 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయిన బంగ్లా 74 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.

Similar News

News December 21, 2024

పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు: అంబటి

image

AP: పథకాల్లో కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు. ప్రభుత్వం సంగతి 6 నెలల్లోనే ప్రజలకు తెలిసిపోయింది. కొందరు పార్టీలు పెట్టి మరో దాంట్లో కలిపేశారు. ఇంకొకరు పార్టీ పెట్టి మరొకరికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ జగన్ అలా కాదు. కష్టమైనా, నష్టమైనా, అన్యాయంగా జైల్లో పెట్టినా ప్రజల కోసం అన్నింటినీ ఎదుర్కొన్నారు’ అని చెప్పారు.

News December 21, 2024

పాతబస్తీలో చ.గజానికి రూ.81వేలు ఇస్తున్నాం: ఎన్వీఎస్ రెడ్డి

image

TG: పాతబస్తీలో మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. విస్తరణపై ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు రచిస్తోందని, త్వరలోనే సీఎం పూర్తి వివరాలు వెల్లడిస్తారని చెప్పారు. పాతబస్తీలో మెట్రో మార్గం కోసం 1100 ఆస్తులను సేకరిస్తున్నామని, చదరపు గజానికి రూ.81వేలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నిర్వాసితులకు చెక్కులు ఇచ్చి, నిర్మాణాలను తొలగిస్తామని వెల్లడించారు.

News December 21, 2024

పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ నటి

image

ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ సీజన్-8తో పాపులర్ అయిన నటి సోనియా ఆకుల వివాహం చేసుకున్నారు. తన ప్రియుడి యశ్‌తో ఇవాళ తెల్లవారుజామున ఆమె పెళ్లి జరిగింది. ఈ వేడుకకు బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో పాటు ఇతర నటులు హాజరయ్యారు. తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా ఆర్జీవీ తెరకెక్కించిన రెండు చిత్రాల్లో నటించారు. దీంతో ఆమెకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.