News April 1, 2025
INDvsENG: ప్రతిష్ఠాత్మక ట్రోఫీకి రిటైర్మెంట్!

ప్రతిష్ఠాత్మక పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇంగ్లండ్‌లో జరిగే టెస్టు సిరీస్‌ను 2007 నుంచి పటౌడీ ట్రోఫీ పేరిట నిర్వహిస్తోంది. ఇకపై ఇరు దేశాల్లోని ఇతర దిగ్గజాల పేరిట సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జూన్-జులై మధ్య జరిగే సిరీస్ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశముంది. IND తరఫున 46 టెస్టులు ఆడిన పటౌడీ 2011లో మరణించారు.
Similar News
News January 22, 2026
అనిల్ రావిపూడి కొత్త సినిమాలో ఇద్దరు హీరోలు?

వరుస హిట్ సినిమాలతో జోరు మీదున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా కలిసి నటిస్తారని టాక్ వినిపిస్తోంది. 2027 సంక్రాంతికి మూవీ రిలీజయ్యే అవకాశముందని సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెంకీ, రానా గతంలో ‘రానా నాయుడు’ సిరీస్‌లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
News January 22, 2026
హత్యారాజకీయాలతో విషబీజాలు నాటుతున్న CBN: జగన్

AP: హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ CBN నాటుతున్న విషబీజాలు చెట్లుగా మారి కంట్రోల్ కాని పరిస్థితులు వస్తాయని జగన్ హెచ్చరించారు. ‘ఇళ్లు, ఆస్తులు వదిలి ఊళ్లు వదిలి వెళ్లిపోయేలా YCP వారిపై కూటమి నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారు. మా కార్యకర్తలను చంపేస్తున్నారు. బాధిత కుటుంబాలు రేపు చూస్తూ ఊరుకుంటాయా? పోలీసులు, MLAలు, CBN బాధ్యత వహించకతప్పదు’ అని పేర్కొన్నారు. పాలకులన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
News January 22, 2026
ప్రపంచంలోనే రద్దీ నగరాలు.. 2వ స్థానంలో బెంగళూరు

ప్రపంచంలోనే రద్దీగా ఉండే నగరాల జాబితాలో బెంగళూరు 2వ ప్లేస్‌లో నిలిచింది. డచ్ లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ టామ్‌టామ్ 2025 ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం బెంగళూరులో సగటు ప్రయాణ వేగం 16.6KM/hr. రద్దీ స్థాయి 74.4%. 2024తో పోలిస్తే ట్రాఫిక్ 1.7% పెరిగింది. ట్రాఫిక్ లేట్తో బెంగళూరు వాసులు ఏడాదిలో 168గంటలు కోల్పోయారు. పుణే 71.1% రద్దీతో 5వ, ముంబై 65.2%తో 18వ స్థానంలో ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్‌లో మెక్సికో ఉంది.


