News August 12, 2025

INDvsENG: చరిత్ర సృష్టించిన సిరీస్

image

ENG, IND మధ్య జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ రికార్డులు తిరగరాసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌‌లో అత్యధిక మంది వీక్షించిన టెస్ట్ సిరీస్‌గా నిలిచింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను జియో హాట్‌స్టార్‌లో 17 కోట్ల మంది తిలకించారు. ఐదో టెస్టు చివరి రోజున ఏకకాలంలో రికార్డు స్థాయిలో 1.3 కోట్ల మంది వీక్షించారు. సిరీస్ మొత్తం 65 బిలియన్ మినట్స్ వాచ్ టైమ్‌ను నమోదు చేసింది. కాగా ఈ సిరీస్ 2-2తో సమమైన విషయం తెలిసిందే.

Similar News

News August 12, 2025

అమరావతి పనులు వేగంగా పూర్తి చేయాలి: చంద్రబాబు

image

AP: రాజధాని అమరావతిలో మొత్తం రూ.81,317 కోట్ల విలువైన పనులు చేపట్టాలని CRDA ప్రతిపాదించిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఇందులో భవన నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు, రోడ్లు, డక్ట్‌లు, ట్రంక్ ఇన్ఫ్రా, వరద నియంత్రణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రికార్డు టైంలో ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని CRDAపై సమీక్షలో సీఎం ఆదేశించారు.

News August 12, 2025

ఫాస్టాగ్ ఏడాది పాస్ అప్లై చేసుకోండిలా!

image

ఈనెల 15 నుంచి అందుబాటులోకి వచ్చే ఫాస్టాగ్ ఏడాది పాస్‌ను మొబైల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ‘Rajmarg Yatra’ యాప్ లేదా NHAI అఫీషియల్ వెబ్‌సైట్‌‌ను సందర్శించాలి. వాహన నంబర్/ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. ప్రస్తుత FASTag యాక్టివ్‌గా ఉండేలా, విండ్‌షీల్డ్‌పై అతికించి ఉండాలి. తర్వాత రూ.3,000 ఛార్జ్ ఆన్లైన్ ద్వారా చెల్లించండి. ఆ తర్వాత మీ ఏడాది పాస్‌ను ప్రస్తుత FASTagకి లింక్ చేయండి.

News August 12, 2025

హైదరాబాద్ మెట్రోకు నిరాశ

image

హైదరాబాద్ మెట్రోకు కేంద్ర క్యాబినెట్ మరోసారి మొండిచేయి చూపింది. ఇవాళ్టి సమావేశంలో బెంగళూరు, థాణె, పుణే, ఢిల్లీ, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు రూ.1.09 లక్షల కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు అనుమతించింది. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-3పై ప్రకటనేమీ లేకపోవడంతో నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. HYD రోడ్లపై రద్దీ విపరీతంగా పెరిగిందని, మెట్రో నిర్మాణానికి అనుమతివ్వాలని కోరుతున్నారు.