News January 12, 2026

INDvsNZ.. తొలి వన్డేలో నమోదైన రికార్డులు

image

⋆ వన్డేల్లో భారత్ 300+ టార్గెట్ ఛేజ్ చేయడం ఇది 20వ సారి. ఈ లిస్టులో భారత్‌దే టాప్ ప్లేస్
⋆ అత్యధిక సార్లు(5) వన్డేల్లో వరుసగా 5 లేదా అంతకంటే ఎక్కువ ఇన్నింగ్స్‌లలో 50+ స్కోర్ చేసిన ఆటగాడిగా కోహ్లీ
⋆ 2025CT తర్వాత వన్డేల్లో NZకి ఇదే తొలి ఓటమి
⋆ 2023 నుంచి వన్డేల్లో NZపై భారత్‌కు వరుసగా ఇది ఎనిమిదో విక్టరీ
⋆ NZపై IND ఛేజ్ చేసిన రెండో హైయెస్ట్ స్కోర్(301) ఇదే

Similar News

News February 17, 2026

$100 బిలియన్లతో అదానీ ఏఐ డేటా సెంటర్లు

image

దేశంలో పర్యావరణహిత AI డేటా సెంటర్ల నిర్మాణానికి 100 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. 2035లోగా నేరుగా $100బిలియన్లు, సంబంధిత రంగాల కోసం మరో $150 బిలియన్లు వెచ్చించనుంది. సర్వర్ మాన్యుఫ్యాక్చరింగ్, సావరిన్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్, సెమీకండక్టర్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తంగా ఈ పెట్టుబడుల ద్వారా పదేళ్లలో $250 బిలియన్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ కాబోతోంది.

News February 17, 2026

శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం

image

శరీరానికి కావలసినంత ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉండి, అధిక క్యాలోరీలు తగ్గుతాయి. కంది, పెసర, మినప, మొదలైన పప్పులు, సొయా, రాజ్మా, అలసందలు, ఉలవలు వంటి గింజలు, పెరుగు, పన్నీర్, సోయా పన్నీర్, కొవ్వు తక్కువగా ఉండే చికెన్, సలాడ్స్, స్ప్రౌట్స్ ప్రోటీన్ ఎక్కువగా అందిస్తాయి. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూసులు మానేయాలి. వీటికి బదులు నీళ్లు, మజ్జిగ, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు.

News February 17, 2026

గోమాత దర్శనంలో పఠించాల్సిన మంత్రం

image

1. నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయాభ్య ఏవచl
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమఃll
2. గావో మమాగ్రతః నను గావో మే సంతు పృష్టతఃl
గావో మే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యాహంll
3. సర్వ దేవమయే దేవి సర్వ దేవైరలం కృతేl
మమాభిలషితంకర్మ సఫలం కురు నందినిll
గోమాతకు ఆహారం పెట్టేటప్పుడు:
ప౦చభూతశివే! పుణ్యే! పవిత్రే! సూర్య సంభవే!
ప్రతీచ్ఛేమం మయాదత్తం సౌరభేయి! నమోస్తుతే!!