News October 25, 2024
INDvsNZ: కష్టాల్లో టీమ్ ఇండియా

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే రెండు వికెట్లు కోల్పోయింది. 56 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ డకౌట్ కాగా గిల్(30), కోహ్లీ(1) నిరాశపర్చారు. క్రీజులో జైస్వాల్(26), పంత్(4) ఉన్నారు. భారత్ ఇంకా 203 రన్స్ వెనకబడి ఉంది. ప్రస్తుత స్కోర్ 61/3.
Similar News
News November 18, 2025
ALERT: ఫోన్ IMEI నంబర్ మారుస్తున్నారా?

ఫోన్లలోని 15 అంకెల IMEI నంబర్‌ను మార్చడం నాన్ బెయిలబుల్ నేరం కిందికి వస్తుందని టెలికం శాఖ హెచ్చరించింది. మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తయారీదారులు, బ్రాండ్ ఓనర్లు, ఇంపోర్టర్లు, సెల్లర్లకు అడ్వైజరీ జారీ చేసింది. నిబంధనలకు లోబడి ఉండాలని సూచించింది. ఐఎంఈఐని మార్చేందుకు ఉపయోగించే పరికరాలను కలిగి ఉండటం కూడా నేరమేనని వార్నింగ్ ఇచ్చింది.

నేడు ఇలా చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి

కృష్ణాంగారక చతుర్దశి ఎన్నో శుభాలను కలిగించే పవిత్రమైన రోజు. నేడు ఎర్ర పూలు/కుంకుమ కలిపిన నీటితో స్నానం చేస్తే అంగారకుడి కటాక్షం కలుగుతుందట. ఆదిత్య మంత్రం 12 సార్లు పలికితే సూర్యుడు అనుగ్రహిస్తాడని నమ్మకం. పితృ తర్పణంతో రుణ బాధలు తొలగి, సంతోషంగా ఉంటారట. గోధుమలు దానమిస్తే జాతకంలో రవి బలం బాగుంటుందట. యమ దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగి, కుజ దోషం పోయి సొంతింటి కల నెరవేరుతుందని పండితులు అంటున్నారు.