News February 15, 2026

INDvsPAK: పాక్ టార్గెట్ 176

image

T20WC: పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 175/7 స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ 77(40 B) క్రీజులో ఉన్నంత వరకు స్కోర్ పరిగెత్తినా తర్వాత నెమ్మదించింది. అభిషేక్ 0, తిలక్ వర్మ 25, సూర్య 32, హార్దిక్ 0, దూబే 27, రింకూ సింగ్ 11* పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అయూబ్ 3, సల్మాన్ అఘా, తారిఖ్, షాహీన్ తలో వికెట్ తీశారు. ఆ జట్టులో 18 ఓవర్లను స్పిన్నర్లే వేయడం గమనార్హం. పాక్ లక్ష్యం 176.

Similar News

News April 11, 2026

పోస్టల్ శాఖ GDS ఫలితాలు విడుదల

image

పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల భర్తీకి JANలో ఇచ్చిన 28,636 పోస్టుల భారీ నోటిఫికేషన్ రెండో షార్ట్ లిస్ట్ విడుదలైంది. మొత్తం పోస్టుల్లో ఏపీలో 1060, TGలో 608 ఖాళీలున్నాయి. తాజా లిస్టులో AP నుంచి 555 మంది, TG నుంచి 214 మంది ఎంపికయ్యారు. వీరంతా APR 27వ తేదీలోగా డివిజనల్ ఆఫీసులో ధ్రువపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.

News April 11, 2026

పిల్లల ఎదుగుదలలో తొలి రెండేళ్లూ కీలకం

image

పిల్లలు ఎదిగే క్రమంలో శారీరకంగానూ మానసికంగానూ తొలి రెండేళ్ల వయసూ చాలా కీలకమంటున్నారు నిపుణులు. దాదాపు 90 శాతం మెదడు ఎదుగుదల తొలి రెండేళ్లలోనే జరుగుతుంది. కాబట్టి మేధోపరంగా, ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రెండేళ్లలోనే నిర్ణయమైపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడుకన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుంది. పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే పిల్లల ఎదుగుదల అంత బావుంటుందంటున్నారు.

News April 11, 2026

ఇంటర్‌లో కొత్త కోర్సు

image

TG: మోడల్ స్కూళ్లలో చేరే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల కోసం విద్యాశాఖ కీలక మార్పు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం (2026-27) నుంచి MEC స్థానంలో ACE (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) కోర్సును తీసుకురావాలని నిర్ణయించింది. మ్యాథ్స్, కామర్స్ రెండూ కష్టమైన సబ్జెక్టులు కావడంతో MECలో అడ్మిషన్లు తగ్గడమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో తొలుత ఈ మార్పు అమల్లోకి రానుంది.