News February 15, 2026
INDvsPAK: పాక్ టార్గెట్ 176

T20WC: పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 175/7 స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ 77(40 B) క్రీజులో ఉన్నంత వరకు స్కోర్ పరిగెత్తినా తర్వాత నెమ్మదించింది. అభిషేక్ 0, తిలక్ వర్మ 25, సూర్య 32, హార్దిక్ 0, దూబే 27, రింకూ సింగ్ 11* పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అయూబ్ 3, సల్మాన్ అఘా, తారిఖ్, షాహీన్ తలో వికెట్ తీశారు. ఆ జట్టులో 18 ఓవర్లను స్పిన్నర్లే వేయడం గమనార్హం. పాక్ లక్ష్యం 176.
Similar News
News April 11, 2026
గ్యాస్ లేకుండానే మంట.. ‘ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్’

గ్యాస్ అవసరం లేకుండానే మంటను పుట్టించే ‘ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్’ మార్కెట్లోకి వస్తోంది. ఇది విద్యుత్ ద్వారా గాలిని అయనీకరణం చేసి 1300°C వరకు వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇండక్షన్ స్టవ్‌లా కాకుండా దీనిపై అన్ని రకాల గిన్నెలు వాడుకోవచ్చు. గ్యాస్ లీకేజీ భయం ఉండదు. సౌర విద్యుత్ వాడేవారికి మరింత లాభదాయకం. సుమారు రూ.35,000 ధర ఉండే ఈ స్టవ్ భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయం కానుంది.
News April 11, 2026
పాలు Vs గుడ్లు.. విటమిన్-Dకి ఏది బెస్ట్?

భారత్‌లో 67% మంది విటమిన్-D లోపంతో బాధపడుతున్నారు. దీనికోసం అదనపు విటమిన్ కలిపిన పాలు (Fortified Milk), కోడిగుడ్డు సొన ప్రధాన ఆహార వనరులు. పరిమాణ పరంగా పాలల్లో విటమిన్-D ఎక్కువగా ఉన్నా గుడ్డు సొనలో ఉండే ‘D3’ని శరీరం త్వరగా గ్రహిస్తుంది. కేవలం ఆహారం ద్వారానే ఈ లోపాన్ని భర్తీ చేయలేమని, రోజూ ఎండ తగిలేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎముకల బలం, రోగనిరోధక శక్తి పెరగాలంటే ఆహారం, ఎండ రెండూ అవసరం.
News April 10, 2026
డీల్ చేసుకుంటారా? చస్తారా?.. ట్రంప్ వార్నింగ్

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు స్టార్ట్ కావడానికి కొన్ని గంటలే ఉన్నాయి. ఈ తరుణంలో ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగే ఈ చర్చల్లో ఇరాన్ డీల్ చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తామని హెచ్చరించారు. ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు బెదిరింపులకు దిగడంపై విమర్శలు వస్తున్నాయి. చర్చల విషయంలో ఇరాన్ సందిగ్ధంలో ఉన్న టైమ్‌లో ట్రంప్ నుంచి వార్నింగ్ రావడం గమనార్హం.


