News February 14, 2026
INDvsPAK.. మేం ఏ పక్షమూ వహించం: కబీర్

ఇండియాతో, అక్కడి ప్రజలతో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను కోరుకుంటున్నామని BNP చీఫ్ తారిఖ్ రెహ్మాన్ అడ్వైజర్ హుమయూన్ కబీర్ వెల్లడించారు. తాము పర్యటించే దేశాల్లో భారత్ కూడా ఒకటని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పాక్‌వైపు మొగ్గుచూపుతున్నారా? అన్న ప్రశ్నకు ‘IND, PAK మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. కానీ మేం ఏ పక్షమూ వహించం. పరస్పర గౌరవం, జాతీయ ప్రయోజనాల ఆధారంగా మేము సంబంధాలను కొనసాగిస్తాం’ అని తెలిపారు.
Similar News
News February 27, 2026
రింకూ సింగ్.. తండ్రి చనిపోయిన బాధలోనూ..

T20WC: యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ రేపు కోల్‌కతాలో భారత జట్టులో చేరుతారని బీసీసీఐ వెల్లడించింది. మార్చి 1న టీమ్ ఇండియా ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. కాగా ఇవాళ తండ్రి మరణంతో <<19254408>>రింకూ<<>> సింగ్ అలీగఢ్ (యూపీ) వెళ్లిన సంగతి తెలిసిందే. తండ్రి <<19250311>>మరణించిన<<>> మరుసటి రోజే రింకూ దేశం కోసం ఆడేందుకు సిద్ధం కావడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
News February 27, 2026
స్వాతంత్ర్యం వచ్చినా బానిస మనస్తత్వం పోలేదు: ప్రధాని మోదీ

ఒకప్పుడు ఫారిన్ టెక్నిక్స్ కాపీ కొట్టే దుస్థితిలో భారత్ ఉండేదని ప్రధాని మోదీ రైజింగ్ భారత్ సమ్మిట్‌లో తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినా చాలా కాలం దేశంలో బానిస మనస్తత్వం పోలేదని విమర్శించారు. ఇప్పుడు తన శక్తి ఏంటో తెలుసుకొని దాని నుంచి బయటపడి అగ్రరాజ్యాలతో ట్రేడ్ డీల్స్ చేసుకునే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో ట్రేడ్ డీల్స్ జరుపుకోవడం చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు.
News February 27, 2026
రివార్డ్ పాలసీ రూ.కోటి ఇవ్వండి: దేవ్ జీ

TG ప్రభుత్వ సరెండర్ పాలసీ బాగుందని లొంగిపోయిన మాజీ మావోయిస్ట్ దేవ్ జీ అన్నారు. ఇవాళ CMతో భేటీ తర్వాత మాట్లాడారు. ‘రివార్డ్ పాలసీని రూ.కోటికి పెంచాలని కోరాం. ఐదెకరాల భూమి ఇవ్వడం సాధ్యం కాదని CM అన్నారు. ఇల్లు, ఉద్యోగం, జీవన భృతిపై హామీ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతిస్తే జైళ్లలో మావోయిస్టులను కలుస్తాం. అందరం కలిసి ప్రజలకు బహిరంగ లేఖ రాస్తాం. తుపాకీ సిద్ధాంతం నడవదని వివరిస్తాం’ అని దేవ్ జీ తెలిపారు.


