News September 22, 2025

INDvsPAK.. మూడోసారి తలపడే అవకాశం?

image

ఆసియాకప్ 2025లో పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా ఫైనల్లో తలపడే ఛాన్స్ ఉంది. ఇదే జోరులో సూపర్-4లో మిగతా రెండు మ్యాచులు గెలిస్తే భారత్ ఫైనల్ చేరనుంది. మరోవైపు శ్రీలంక, బంగ్లాదేశ్ కన్నా పాక్ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరితే ముచ్చటగా మూడో సారి తలపడే అవకాశముంది. అటు 2022 నుంచి బిగ్ ఈవెంట్లలో PAKపై భారత్‌ డామినేషన్ కొనసాగుతోంది. 2022 T20WC నుంచి నిన్నటి వరకు మొత్తం 7 మ్యాచుల్లో టీమ్ ఇండియా జయభేరి మోగించింది.

Similar News

News January 24, 2026

దీర్ఘాయుష్షుకు 5 నిమిషాల ఎక్స్‌ట్రా ఎక్సర్‌సైజ్ చాలు!

image

ఆయుష్షు పెంచుకోవడానికి గంటల తరబడి శ్రమించక్కర్లేదు. రోజుకు కేవలం 5 నిమిషాలు ఎక్స్‌ట్రా ఎక్సర్‌సైజ్ చేసినా లేదా 30 నిమిషాలు కూర్చునే సమయం తగ్గించినా ఆయుర్దాయం పెరుగుతుందని ‘ది లాన్సెట్’లో పబ్లిష్ అయిన తాజా స్టడీ వెల్లడించింది. మంచి నిద్ర, పోషకాహారం, తక్కువ ఒత్తిడి, స్మోకింగ్, డ్రింకింగ్‌కి దూరంగా ఉండడం వంటి మార్పులు తోడైతే దీర్ఘాయువు మీ సొంతం. రోజూ కాసేపు వేగంగా నడిచినా ఆరోగ్యం పదిలంగా ఉన్నట్లే.

News January 24, 2026

విష్ణుమూర్తికి నైవేద్యం ఏ పాత్రలో పెట్టాలి?

image

విష్ణువుకు నైవేద్యం సమర్పించడానికి రాగి పాత్ర శ్రేష్టం. పూర్వం విష్ణు భక్తుడైన గుడాకేశుడు తన శరీరం లోహంగా మారాలని కోరుకున్నాడు. స్వామి అనుగ్రహంతో రాగిగా మారాడు. తన భక్తుని శరీర రూపమైన రాగి పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడం విష్ణువుకు ప్రీతికరం. శాస్త్రీయంగా కూడా రాగికి బ్యాక్టీరియాను నశింపజేసే గుణం, రోగనిరోధక శక్తిని పెంచే స్వభావం ఉంది. అందుకే దేవాలయాల్లో రాగి పాత్రల్లోనే తీర్థం ఇస్తుంటారు.

News January 24, 2026

బొప్పాయిలో రసం పీల్చే పురుగులను ఎలా నివారించాలి?

image

బొప్పాయి మొక్కలు నాటడానికి 15 రోజుల ముందే తోట చుట్టూ 2 వరుసల్లో అవిశ, 2 వరుసల్లో మొక్కజొన్న మొక్కలను నాటాలి. అలాగే పొలంలో రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని తెలుసుకోవడానికి ఎకరాకు 12-15 పసుపు రంగు జిగురు అట్టలను మొక్కల కన్నా ఎత్తులో పెట్టాలి. ఒకవేళ రసం పీల్చే పురుగులను గమనిస్తే లీటరు నీటికి వేపనూనె 2.5ml+ అసిఫేట్ 1.5 గ్రా+ జిగురు 0.5ml కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉద్ధృతిని బట్టి పిచికారీ చేయాలి.