News June 7, 2024
INDvsPAK మ్యాచ్.. ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్!

న్యూయార్క్‌లో ఈ నెల 9న జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని ‘అక్యూ వెదర్’ పేర్కొంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 (ఇండియాలో రా.8.30) గంటలకు 51 శాతం వరకు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల వరకు 45-50% వర్ష సూచన ఉండటంతో మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
Similar News
News November 23, 2025
సీట్స్ ఫుల్.. టికెట్స్ నిల్! తప్పదు చిల్లు..!!

AP: సంక్రాంతికి ఊరికి వెళ్దాం అనుకున్న వారికి ఈసారీ అధిక చెల్లింపు చిల్లు తప్పదేమో. పెద్ద పండుగకు ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాలకు వెళ్లే రైళ్లు, విమానాల్లో టికెట్స్ బుక్ అయ్యాయి. రెండు నెలల ముందే సీట్స్ నిండి వెయిటింగ్ లిస్ట్ వందల్లో కన్పిస్తోంది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ బుకింగ్స్ రేట్స్ ఇప్పట్నుంచే పెంచేస్తున్నాయి. ఇంకేముంది.. ఎప్పట్లాగే ఈసారీ ప్రైవేటును ఆశ్రయించి ఛార్జీ వేటుకు గురవక తప్పదు.
News November 23, 2025
పర్సనల్ లైఫ్ తప్ప పైరసీపై నోరుమెదపని iBOMMA రవి?

iBOMMA నిర్వాహకుడు రవి నాలుగో రోజు విచారణలో తన లైఫ్‌స్టైల్ గురించి పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ‘పైరసీతో వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేశా. 15-20 రోజులకొకసారి విదేశాలకు వెళ్లాను. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, US, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, దుబాయ్ తదితర దేశాలు తిరిగాను’ అని చెప్పినట్లు తెలుస్తోంది. పర్సనల్ విషయాలు తప్ప పైరసీ నెట్వర్క్ గురించి నోరు తెరవలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
News November 23, 2025
సర్పంచ్ ఎన్నికల ఖర్చు అంతే!

TG: సర్పంచ్ ఎన్నికల ఖర్చు విషయంలో ఎన్నికల సంఘం అధికారులు మరోసారి స్పష్టత ఇచ్చారు. 2011 సెన్సెస్ ఆధారంగా ఖర్చు ఉంటుందని వెల్లడించారు. 5వేల ఓటర్లకు పైగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, 5 వేల లోపు పంచాయతీల్లో రూ.1.50 లక్షలు, 5 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులకు రూ.50 వేలు, 5 వేలకు తక్కువగా ఉన్న గ్రామాల్లో రూ.30 వేల చొప్పున ఖర్చు పెట్టాల్సి ఉంటుందని వివరించారు.


