News June 10, 2024
లాహోర్‌లో INDvsPAK మ్యాచ్!
టీ20 WC తర్వాత 8 నెలలకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. 2025 FEB 19-MAR9 మధ్య ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు సమాచారం. డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం లాహోర్ వేదికగా INDvsPAK మ్యాచ్ జరగనున్నట్లు CRICBUZZ పేర్కొంది. అయితే దీనికి భారత ప్రభుత్వం, బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని తెలిపింది. ఒకవేళ పాక్‌లో ఆడేందుకు భారత్ నిరాకరిస్తే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
Similar News
News December 23, 2024
మావోయిస్టు కీలక సభ్యుడు ప్రభాకర్ రావు అరెస్టు
నార్త్ బస్తర్ రీజియన్‌లో మావోయిస్టు సంస్థ కీలక సభ్యుడు, తెలంగాణలోని బీర్పూర్‌కు చెందిన ప్రభాకర్ రావు అలియాస్ బల్మూరి నారాయణ రావు (57)ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది. ప్రభాకర్ రావు కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు కణ్కేర్ జిల్లా పరిధిలో అరెస్టు చేశారు. 40 ఏళ్లుగా దళంలో ఉన్న ప్రభాకర్ రావు మావోల MOPOS టీంలో కీలకమని పోలీసులు తెలిపారు.
News December 23, 2024
VIRAL: షమీ-సానియా పెళ్లి ఫొటోలు.. నిజమిదే
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ షమీ తన భార్యతో, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్తతో కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే షమీ, సానియా పెళ్లి చేసుకున్నారంటూ తాజాగా కొన్ని ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ ఏఐ రూపొందించిన ఫొటోలే. కొందరు కావాలనే షమీ, సానియా పక్కపక్కనే ఉన్నట్లుగా ఫొటోలను ఏఐతో డిజైన్ చేశారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు.
News December 23, 2024
SSA ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: హరీశ్
TG: కాంగ్రెస్ ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. హనుమకొండలో దీక్ష చేస్తున్న SSA ఉద్యోగులను ఆయన కలిశారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారని దుయ్యబట్టారు. తాము రూ.4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, రూ.7 లక్షల కోట్లని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.