News November 11, 2025
INDvsSA: టాస్‌కు గాంధీ-మండేలా కాయిన్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈనెల 14 నుంచి IND-SA తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ టాస్ కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ స్పెషల్ గోల్డ్ కాయిన్‌ను సిద్ధం చేసింది. ఇది గాంధీ-మండేలా ట్రోఫీ కావడంతో నాణేనికి చెరోవైపు వారి చిత్రాలను రూపొందించింది. భారత్, దక్షిణాఫ్రికా స్వాతంత్య్రం కోసం వారు చేసిన కృషికి నివాళిగా ఈ కాయిన్‌ను వాడనుంది. కాగా గువాహటి వేదికగా NOV 22-26 మధ్య రెండో టెస్టు జరగనుంది.
Similar News
News November 11, 2025
బిహార్‌లో NDA జయకేతనం: పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్

బిహార్‌లో BJP, JDU నేతృత్వంలోని NDA కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. 243 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, NDAకి 133-159, మహాఘట్ బంధన్‌కు 75-101, ఇతరులకు 2-8 స్థానాలు, జన్ సురాజ్ పార్టీకి 0-5 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని వివరించింది. దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యంతో మహాఘట్ బంధన్ కూటమిపై NDA పైచేయి సాధించనున్నట్లు తెలిపింది.
News November 11, 2025
భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. బీజాపూర్ జిల్లాలో ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య <<18257519>>ఎదురు కాల్పులు<<>> జరుగుతున్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆరుగురు మావోల మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 11, 2025
అల్-ఫలాహ్ యూనివర్సిటీ.. లింకులన్నీ ఇక్కడి నుంచే!

ఢిల్లీలో పేలుడు ఘటనతో హరియాణా ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ, హాస్పిటల్ వార్తల్లోకెక్కింది. ఇక్కడ 40% డాక్టర్లు కశ్మీర్‌కు చెందినవారే ఉన్నారు. లోకల్ డాక్టర్లు, విద్యార్థులను కాకుండా ఎక్కువ మంది కశ్మీర్ ప్రాంతానికి చెందినవారిని తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. జైషే మహమ్మద్‌తో సంబంధం ఉన్న ముజామిల్, షాహిన్, నిన్న పేలుడు సమయంలో కారు నడిపిన డాక్టర్ ఉమర్ ఇక్కడి వారే కావడం గమనార్హం.


