News November 7, 2024
INDvsSA: టీ20 ట్రోఫీ ఇదే

సౌతాఫ్రికా, భారత జట్ల మధ్య టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా రేపు రాత్రి 8.30గంటలకు మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల కెప్టెన్లు ట్రోఫీ ఆవిష్కరించారు. ఇద్దరూ కలిసి ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడి టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్ ఈ టీ20 సిరీస్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Similar News
News January 31, 2026
బెదిరింపులు ఆపితే అమెరికాతో చర్చలకు సిద్ధమే: ఇరాన్

ట్రంప్ ప్రభుత్వం తన బెదిరింపులను ఆపితే చర్చలకు సిద్ధమని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ ప్రకటించారు. ఇరాన్ యుద్ధానికి ఎంత సిద్ధంగా ఉందో, చర్చలకూ అంతే సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే తమ మిస్సైల్ కార్యక్రమంపై మాత్రం రాజీ పడబోమని తేల్చి చెప్పారు. అమెరికా సైనిక చర్యలకు దిగితే అది ఇరు పక్షాల మధ్య యుద్ధంగా మిగిలిపోదని, మిడిల్ ఈస్ట్ అంతటా ఉద్రిక్తతలకు దారితీస్తుందని హెచ్చరించారు.
News January 31, 2026
రీప్లేస్‌మెంట్‌కు రెడీ.. పాక్ స్థానంలో ఆడతామన్న ఉగాండా

T20 WCలో ఆడటంపై పాక్ ఇప్పటికీ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో క్రికెట్ ఆడే చిన్న దేశాలు పాకిస్థాన్‌ను ట్రోల్ చేస్తున్నాయి. ఇప్పటికే దాని స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని కోరిన <<18982902>>ఐస్‌లాండ్<<>>.. ఆ వెంటనే అందుబాటులో ఉండలేమని సెటైరికల్ పోస్ట్ చేసింది. ఇది ఉగాండాకు కలిసొస్తుందని పేర్కొంది. దీంతో నేడు ఉగాండా కూడా అవకాశం ఉంటే ఆడేందుకు తాము సిద్ధమని.. బ్యాగ్‌లు రెడీ చేసుకున్నామని ఫన్నీగా పోస్ట్ పెట్టింది.
News January 31, 2026
జంతు కొవ్వు కలిసిందని కేంద్ర సంస్థే చెప్పింది: లోకేశ్

AP: దేవుడి లడ్డూపై వైసీపీ డ్రామా మొదలుపెట్టిందని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేశ్ టీడీపీ శ్రేణులకు సూచించారు. ‘2024లో చంద్రబాబు సీఎం కాగానే నెయ్యి శాంపిల్స్ తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ఆధ్వర్యంలోని సంస్థ ద్వారా టెస్ట్ చేయగా జంతు కొవ్వు కలిసిందని, వెజిటబుల్ ఆయిల్ ఉందని తేలింది. మొన్నటి ఛార్జ్‌షీట్ పేజీ నెం.35లో సీబీఐ చాలా స్పష్టంగా చెప్పింది’ అని కాకినాడలో కార్యకర్తల సమావేశంలో తెలిపారు.


