News August 2, 2024
INDvsSL: నేడు తొలి వన్డే.. లంక పుంజుకునేనా?

శ్రీలంకపై T20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన IND వన్డే పోరుకు సిద్ధమైంది. ఇవాళ తొలి వన్డే జరగనుంది. T20Iలకు రిటైర్మెంట్ ప్రకటన తర్వాత రోహిత్, కోహ్లీ మొదటిసారి ODI బరిలో దిగుతున్నారు. మరోవైపు వరుస ఓటములతో ఢీలాపడిన లంక ODIల్లోనైనా పుంజుకోవాలని ఆరాటపడుతోంది. మ.2.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
Probable XI: రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, KL/పంత్, దూబే, అక్షర్, హర్షిత్, కుల్దీప్, సిరాజ్, అర్ష్‌దీప్
Similar News
News March 10, 2026
ఎల్ నినో.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: వీసీ

AP: ఈ ఏడాది ఏప్రిల్ వరకు ENSO(ఎల్ నినో+లా నినా) పరిస్థితులకు అవకాశం ఉందని ఎన్జీ రంగా వర్సిటీ వీసీ జయలక్ష్మీ దేవి వెల్లడించారు. జులై తర్వాత <<19250011>>ఎల్ నినోకు<<>> 60 శాతం ఛాన్స్ ఉందని తెలిపారు. దీనివల్ల నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలని సూచించారు. నష్టాలను నివారించడానికి వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలన్నారు.
News March 10, 2026
1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం: ఇజ్రాయెల్

యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 1,900 మంది ఇరాన్ సైనికులు, కమాండర్లను చంపేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్‌నూ టార్గెట్ చేసే అంశాన్ని కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. ఇక ఇరాన్, హెజ్బొల్లా దాడుల్లో ఇజ్రాయెల్‌లో 12 మంది పౌరులు, ఇద్దరు జవాన్లు మరణించినట్లు తెలిపింది. గాయపడిన వారిలో 2,238 మంది ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారని, 91 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది.
News March 10, 2026
BREAKING: రూ.10వేలు పెరిగిన KG వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,62,380కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 ఎగబాకి రూ.1,48,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.10,000 పెరిగి రూ.3,00,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.


