News October 3, 2025
INDvsWI టెస్టు.. రెండో రోజు ఆట మొదలు

అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్, టీమ్‌ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. మొదటి రోజు తొలి ఇన్నింగ్సులో WI 162 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం టీమ్ ఇండియా 2 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఇంకా 26 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో రాహుల్(62*), గిల్(20*) ఉన్నారు. ఇవాళ భారత బ్యాటర్లు నిలదొక్కుకుంటే వెస్టిండీస్‌పై పైచేయి సాధించే అవకాశం ఉంది.
Similar News
News February 14, 2026
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

తూర్పు గోదావరి జిల్లాలో 6 కోర్టు అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, 7వ తరగతి అర్హత కలిగి, వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. కోర్టు అసిస్టెంట్‌కు నెలకు రూ.10వేలు, కోర్ట్ అటెండెంట్‌కు రూ.6వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://eastgodavari.dcourts.gov.in/
News February 14, 2026
ఆయిల్ పామ్ తోటల్లో ఈ అంతర పంటలతో మేలు

ఆయిల్ పామ్ మొక్కలు తొలి మూడేళ్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంతర పంటలను సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా నాటిన మొక్కల చుట్టూ జనుము, జీలుగా, పెసర, అపరాలను 5 నుంచి 6 వరుసలుగా విత్తుకోవాలి. దీంతో తేమ ఆరిపోకుండా ఉంటుంది. పూత సమయంలో వీటిని దున్నితే సేంద్రియ పదార్థం పెరుగుతుంది. కూరగాయలు, పొట్టి అరటి, పూల మొక్కలు, మిర్చి, పసుపు, అల్లం, అనాస వంటివి అంతర పంటలుగా సాగు చేయడానికి అనువైనవి.
News February 14, 2026
శివరాత్రి రోజున ఏం చేయాలంటే?

శివరాత్రి రోజున భక్తుల కార్యాలు జన్మజన్మల పాపాలను హరిస్తాయని పండితులు చెబుతున్నారు. శివునికి ప్రీతిపాత్రమైన బిల్వదళాలు సమర్పించాలని సూచిస్తున్నారు. ‘పంచామృత అభిషేకం విశేష ఫలితాలను ఇస్తుంది. భజనలు చేస్తూ, రాత్రంతా జాగరణ ఉంటూ, ఈశ్వర నామస్మరణలో గడిపితే అజ్ఞానం నశిస్తుంది. మనసా వాచా కర్మణా శివుడి ఆరాధన ఆధ్యాత్మిక ఉన్నతిని కల్పిస్తుంది. ఇలా కైలాసనాథుని అనుగ్రహం లభిస్తుంది’ అని చెబుతున్నారు.


