News October 4, 2025

INDvsWI: ఫస్ట్ టెస్ట్ మనదే

image

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్& 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్సులో విండీస్ 146 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు జడేజా 4, సిరాజ్ 3, కుల్దీప్ 2 వికెట్లతో చెలరేగారు. అంతకుముందు తొలి ఇన్నింగ్సులో విండీస్ 162 రన్స్ చేయగా భారత జట్టు 448/5(D) పరుగులు చేసింది. ముగ్గురు భారత ప్లేయర్లు సెంచరీలు చేశారు. రెండో టెస్టు 10 నుంచి జరగనుంది.

Similar News

News October 4, 2025

అమెరికాలో హైదరాబాద్‌ వాసి దారుణ హత్య

image

అమెరికాలో దుండగుడి దుశ్చర్యకు మరో <<17684402>>తెలుగు<<>> వ్యక్తి బలయ్యాడు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన పోలే చంద్రశేఖర్ ఉన్నత చదువుల కోసం US వెళ్లారు. ఈక్రమంలోనే డాలస్‌లోని పెట్రోల్ బంక్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఓ దుండగుడు పెట్రోల్ కొట్టించుకునేందుకు బంక్‌కు వచ్చి చంద్రశేఖర్‌ను దారుణంగా కాల్చి చంపాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. US పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News October 4, 2025

రోహిత్ ఫ్యాన్స్‌కు హార్ట్ బ్రేక్!

image

భారత క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ శకం ముగిసినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే టెస్టులు, T20లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. AUSతో వన్డే సిరీస్‌కు ఆయనను కాదని <<17911822>>గిల్‌కు<<>> కెప్టెన్సీ అప్పగించడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక ఆసీస్ సిరీస్‌ తర్వాత హిట్‌మ్యాన్ వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మీరేమంటారు?

News October 4, 2025

ముగిసిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

image

TG: పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ ఇవాళ హాజరయ్యారు. వీరి అడ్వకేట్లను పిటిషనర్స్(BRS) తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇప్పటికే కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్‌ల విచారణ ముగిసింది. దీంతో మరో నలుగురి ఎమ్మెల్యేల విచారణ కోసం త్వరలో షెడ్యూల్ విడుదలవనుంది.