News October 29, 2024

INDWvsNZW: సిరీస్‌ గెలిచేదెవరు?

image

భారత్-కివీస్ మహిళల జట్ల మధ్య నేడు కీలకమైన చివరి వన్డే జరగనుంది. తొలి వన్డేలో గెలిచిన టీమ్ ఇండియా రెండో మ్యాచ్‌లో బోల్తా పడిన విషయం తెలిసిందే. రెండు వన్డేల్లోనూ భారత బ్యాటర్లు కనీసం అర్ధ సెంచరీ చేయకపోవడం ఆందోళన కలిగించే అంశం. కెప్టెన్ హర్మన్ కౌర్, స్మృతి, జెమీమా, షఫాలీ రాణించాల్సి ఉంది. మధ్యాహ్నం 1.30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.

Similar News

News February 21, 2026

17 లక్షల యాప్స్‌పై బ్యాన్!

image

ఆండ్రాయిడ్ యూజర్ల భద్రత కోసం ప్లేస్టోర్ క్లీనింగ్ చర్యలను గూగుల్ చేపట్టింది. ఫేక్, పాలసీలను ఉల్లంఘిస్తున్న 17.5 లక్షల యాప్స్‌ను బ్యాన్ చేసింది. హానికరమైన, ఫేక్ యాప్స్‌కు చెందిన 80 వేల డెవలపర్ అకౌంట్లను బ్లాక్ చేసింది. మరోవైపు 16 కోట్ల స్పామ్ రేటింగ్స్, ఫేక్ ఫీడ్ బ్యాక్స్‌ను డిలీట్ చేసింది. 2.55 లక్షల యాప్స్ అనవసరంగా లొకేషన్, ఫొటోలు, ఇతర వ్యక్తిగత సమాచారం అడగకుండా నిరోధించినట్లు కంపెనీ తెలిపింది.

News February 21, 2026

సూపర్-8 సమరం ఇవాళ్టి నుంచే!

image

T20 WCలో లీగ్ దశ ముగిసింది. ఇవాళ్టి నుంచి సూపర్-8 సమరం మొదలుకానుంది. మొత్తం 8 టీమ్స్‌లో టాప్-4 సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. నేటి రాత్రి 7 గంటలకు కొలంబో వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇంగ్లండ్, శ్రీలంక, రాత్రి 7 గంటలకు ఇండియా, సౌతాఫ్రికా మ్యాచులు జరగనున్నాయి.