News November 4, 2024
నాసిరకం EV బ్యాటరీ.. OLAకి రూ1.7 లక్షలు ఫైన్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో నాసిరకం బ్యాటరీలను వాడుతున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన సునీల్ అనే వ్యక్తి నాసిరకం బ్యాటరీపై వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి నోటీసులిచ్చినా సంస్థ పట్టించుకోలేదు. దీంతో రూ.1.73లక్షలు జరిమానా చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఓలాను ఆదేశించింది. అతను పడిన మానసిక క్షోభకు రూ.10వేలు అదనంగా చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది.
Similar News
News November 16, 2025
ఖమ్మం: అంతా వారి డైరెక్షన్లోనే..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్శాఖలో డాక్యుమెంట్ రైటర్ల దందా నడుస్తోంది. జిల్లాలో 11సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లు ఉండగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కొన్నేళ్లుగా జోరుగా సాగుతోంది. ఇదే అదునుగా రైటర్లు దండుకుంటున్నారు. 250 మందికి పైగా రైటర్లు ఇదే ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై రూల్స్కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News November 16, 2025
APPLY NOW: MECLలో ఉద్యోగాలు

మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (<
News November 16, 2025
వేదాలను ఎందుకు అధ్యయనం చేయాలి?

వేదాలు అమూల్య రత్నాలు గల మహాసముద్రాల కంటే లోతైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. అందుకే వాటిని అధ్యయనం చేయాలి. వీటిలో విశ్వ రహస్యాలు, సైంటిఫిక్ విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఇహ, పరలోకాల్లో శాశ్వత ఆనందాన్ని, సుఖాలను అందించే మార్గాన్ని చూపుతాయి. సామాన్య మానవుడిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. మన జీవితాన్ని ఉన్నతంగా, సంతోషంగా మార్చుకోవడానికి, సృష్టి రహస్యాలు తెలుసుకోవడానికి వేదాలు చదవాలి. <<-se>>#VedikVibes<<>>


