News July 14, 2024

చొరబాటు యత్నం.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

image

జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. వీరిని భద్రతా బలగాలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. వీరు ఏ ఉగ్రసంస్థకు చెందినవారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. చొరబాటు వ్యతిరేక ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 13, 2025

ఆశపడి వెల్లుల్లితిన్నా రోగం అట్లాగే ఉందట

image

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని, కొన్ని రోగాలను నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఘాటును భరించి తిన్నా ఎలాంటి మార్పు లేకపోతే నిరాశే ఎదురవుతుంది. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ప్రయాసపడి, కష్టపడి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఫలితం శూన్యమైనప్పుడు లేదా పరిస్థితిలో పురోగతి లేనప్పుడు ఈ సామెతను సందర్భోచితంగా వాడతారు.

News December 13, 2025

బలి ‘గుమ్మడికాయ’తో ఇద్దామా?

image

అమ్మవార్లకు చాలామంది కోడి, మేకలను బలి ఇస్తారు. అయితే ఈ జంతు బలి కంటే కూడా గుమ్మడికాయ బలితోనే అమ్మవారు ఎక్కువ సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు. కూష్మాండాన్ని శిరస్సుకు ప్రతీకగా భావించి అమ్మవారికి దీన్ని సమర్పించాలని మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ విధానమే శ్రేయస్కరమని చెబుతున్నాయి. అందుకే దసరాకి కూష్మాండాన్నే బలిస్తారు. ఇది హింస లేని, దైవ ప్రీతి కలిగించే ఉత్తమ మార్గం.

News December 13, 2025

మెస్సీతో ఫొటో రూ.10లక్షలు.. ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారంటే?

image

దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ భారత పర్యటన మొదలైంది. ఈ తెల్లవారుజామున కోల్‌కతా చేరుకున్న ఆయన సాయంత్రానికి HYD రానున్నారు. ఇక్కడ మ్యాచ్ అనంతరం ఫొటో సెషన్ ఉండనుంది. ఆయనతో ఫొటో దిగేందుకు రూ.10లక్షల ఫీజు నిర్ణయించగా 60 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు HYD గోట్ టూర్ అడ్వైజర్ పార్వతీ రెడ్డి తెలిపారు. అటు ఇవాళ సాయంత్రం ఉప్పల్‌లో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం 27 వేల టికెట్లు బుక్ అయ్యాయి.