News June 14, 2024
సమాచార వారధి ‘రియల్ టైం గవర్నెన్స్’

AP: టెక్నాలజీ సాయంతో పరిపాలనను సులభతరం చేసేందుకు 2014లో TDP ప్రభుత్వం తెచ్చిన వ్యవస్థే రియల్ టైమ్ గవర్నెన్స్. చంద్రబాబు రాకతో ఇది మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వ్యవస్థతో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో సచివాలయంలోనే పర్యవేక్షించొచ్చు. ప్రభుత్వ శాఖల పనితీరు, ట్రాఫిక్, ప్రాజెక్టులు, మీడియా, వాతావరణం వంటి అంశాలను RTGS కేంద్రం నుంచే సమీక్షించొచ్చు. తమ ప్రాంతాల్లోని సమస్యలపై ప్రజలు ఇందులో ఫిర్యాదు చేయొచ్చు.
Similar News
News October 27, 2025
ప్రతి కుటుంబ ఆదాయంపై కేంద్రం సర్వే

జనగణన… ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్… తాజాగా ఈ సర్వేల జాబితాలోకి మరొకటి చేరింది. పాన్ ఇండియా స్థాయిలో ఆదాయ సర్వేకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా 2026 FEB నుంచి ఈ ఆదాయ గణనను MoSPI ఆరంభిస్తుంది. ప్రతి కుటుంబ ఆదాయాన్ని లెక్కించనుంది. 2027 మధ్యలో సర్వే వివరాలు ప్రకటిస్తారు. అయితే ఇన్‌కమ్ వివరాలు రాబట్టడం సవాళ్లతో కూడుకున్నది కావడంతో ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.
News October 27, 2025
త్వరలో SBIలో 3,500 పోస్టుల భర్తీ!

వచ్చే 6 నెలల్లో ఎస్బీఐ 3500 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 505 పీఓ పోస్టులు ఉన్నట్లు ఎస్బీఐ డిప్యూటీ ఎండీ కిశోర్ కుమార్ వెల్లడించారు. 3వేల సర్కిల్ ఆధారిత అధికారులను నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా పీఓ పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు. బ్యాంక్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రిపేర్ కావొచ్చు.
News October 27, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు!

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీ మీదుగా నడిచే 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు కొన్ని రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణానికి ముందు రైల్ స్టేటస్ చూసుకోవాలని సూచించింది.
* ట్రైన్స్ లిస్ట్ కోసం పైన ఫొటోలను స్లైడ్ చేయండి.


