News July 18, 2024
క్యూ1 ఫలితాల్లో ఇన్ఫోసిస్ జోరు

FY25 తొలి త్రైమాసిక ఫలితాల్లో (APR-JUN) ఇన్ఫోసిస్ రాణించింది. నికర లాభంలో ₹6,368 కోట్లు (7.1% వృద్ధి) ఆర్జించింది. FY24 క్యూ1లో ఇది ₹5,945 కోట్లకు పరిమితమైంది. అయితే గత త్రైమాసికం (JAN-MAR)తో పోలిస్తే నికర లాభం 20% తగ్గింది. ఆపరేషన్స్‌కు సంబంధించిన కన్సాలిడేటెడ్ రెవెన్యూ FY24తో పోలిస్తే 3.6% పెరిగి ₹39,315కోట్లకు చేరింది. కాగా Q1లో అంచనాలకు మించి వృద్ధి నమోదు కావడంపై సంస్థ హర్షం వ్యక్తం చేసింది.
Similar News
News November 22, 2025
బాలికలకు సంతూర్ స్కాలర్షిప్.. రేపే లాస్ట్ డేట్

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో అందించే సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. AP, మహారాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థినులు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. వీరికి 30వేల రూపాయలు అందుతుంది.
వెబ్సైట్: <
News November 22, 2025
రైతులకు గుడ్ న్యూస్.. ఫసల్ బీమా యోజనలో మార్పులు!

PM ఫసల్ బీమా యోజనలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇకపై జంతువుల దాడి, వరదలు/నీట మునగడం వల్ల పంట నష్టం వాటిల్లితే పరిహారం ఇవ్వనుంది. ఇప్పటిదాకా కరవు, వడగళ్లు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులే స్కీమ్‌లో ఉండేవని, కొత్తగా ఈ రెండింటిని చేర్చామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. రైతుల వినతిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2026-27 ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు.
News November 22, 2025
‘నక్క’ బుద్ధి చూపించింది!.. భారతీయుల ఆగ్రహం

ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ క్రికెట్ ఛానల్‌పై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో మ్యాచ్ అయితే ఒకలా, ఆస్ట్రేలియాలో అయితే మరోలా మాట్లాడుతోందని అంటున్నారు. యాషెస్ టెస్టులో తొలి రోజు 19 వికెట్లు పడ్డాయంటూ గొప్పగా రాసుకొచ్చింది. అయితే ఇటీవల INDvsSA టెస్టు మ్యాచ్‌లో ఒకేరోజు 15 వికెట్లు పడటంపై “RIP TEST CRICKET” అంటూ పేర్కొంది. దీంతో ‘నక్క’ బుద్ధి చూపిస్తోందని ట్రోల్ చేస్తున్నారు.


