News July 31, 2024
ఇన్ఫోసిస్ రూ.32వేల కోట్ల పన్ను ఎగవేత?

టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.32వేల కోట్ల పన్ను ఎగవేసిందంటూ ఆ సంస్థపై GST అధికారులు దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 2017-2022 మధ్య ఇన్ఫోసిస్ IGST చెల్లించలేదని, ఆ సంస్థ విదేశాల్లోనూ క్లయింట్స్ కోసం బ్రాంచీలు ఏర్పాటు చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST పేర్కొంది. ఇప్పటికే DGGI నుంచి ఇన్ఫోసిస్‌కు నోటీసు అందినట్లు సమాచారం. దీనిపై ఆ సంస్థ ఇంకా స్పందించలేదు.
Similar News
News October 23, 2025
రాజ్యాంగ విలువలు వర్ధిల్లడం మునీర్‌కు ఇష్టం లేదు: ఇమ్రాన్ ఖాన్

సైనిక బలంతో వ్యవస్థలన్నీ నాశనం చేస్తున్నాడని PAK ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌పై ఆ దేశ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. చట్టబద్ధ పాలన, న్యాయం, రాజ్యాంగ విలువలు వర్ధిల్లడం ఆయనకు ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల మద్దతు లేకుండా ఏ దేశమూ బలోపేతం కాదని చెప్పారు. తనను జైల్లో ఒంటరిగా ఉంచారని, కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు. AFGతో ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
News October 23, 2025
ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల

AP: ఉపాధి హామీ పథకానికి మెటీరియల్ కాంపోనెంట్ కింద 2025–26 ఏడాదికి మొదటి విడతగా కేంద్రం రూ.665 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.166 కోట్లు జత చేసింది. రాష్ట్రంలో పంచాయతీ భవనాల నిర్మాణం, రికార్డులు కంప్యూటరీకరణ, ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ నిమిత్తం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్(RGSA) ద్వారా రూ.50 కోట్లు నిధులు విడుదల చేసింది. వీటికి రాష్ట్రం రూ.33 కోట్లు జత చేయనుంది.
News October 23, 2025
రాకియా పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా

TG: వాన్‌పిక్ వ్యవహారంలో వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌పై రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(RAKIA) దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు(HYD) విచారించింది. తమకు రూ.600 కోట్లు చెల్లించాలన్న రస్ అల్ ఖైమా కోర్టు ఆదేశాలు అమలు చేయాలని రాకియా పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను త్వరగా తేల్చాలని ఇటీవల TG హైకోర్టు ఆదేశించింది. రాకియా ఎగ్జిక్యూటివ్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.