News February 27, 2025
అమానుషం.. పిల్లాడు హోంవర్క్ చేయలేదని..

AP: హోంవర్క్ చేయలేదని ఒంగోలు బాలాజీరావుపేటలో 3వ తరగతి బాలుడు దేవాష్‌కు ట్యూషన్ టీచర్ వాతలు పెట్టారు. అవి పుండ్లుగా మారి చిన్నారి అవస్థ పడుతున్నాడు. దీంతో SNపాడు(M)లో సచివాలయ ఉద్యోగిగా పనిచేసే బాలుడి తల్లి గౌతమి టీచర్ సాబిరాకు ఫోన్ చేసి ఘటనపై అడగ్గా వాగ్వాదం జరిగింది. ఆపై టీచర్ భర్త తనకు కాల్ చేసి బెదిరించినట్లు గౌతమి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దేవాష్ తండ్రి విశాఖలో జాబ్ చేస్తుంటారు.
Similar News
News February 27, 2025
ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం: KTR

TG: సినీ నిర్మాత కేదార్ మరణం గురించి సీఎం రేవంత్ చేసిన <<15587966>>వ్యాఖ్యలపై<<>> బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘హత్యలు, మరణాలు అంటూ అనవసర ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో ఉండి ప్రతిపక్షంలా మాట్లాడుతున్నారు. తాను ఏం చెప్పినా జనాలు నమ్ముతారని అనుకోవడం పొరపాటే. ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉంది. ఎలాంటి విచారణకైనా సిద్ధం’ అని స్పష్టం చేశారు.
News February 27, 2025
ఉత్తరాదిన 25 భాషలను మింగేసిన హిందీ: స్టాలిన్

ఉత్తరాదిన 25 భాషలను హిందీ మింగేసిందని TN CM స్టాలిన్ ఆరోపించారు. ‘హిందీ ఒత్తిడి ప్రాచీన మాతృభాషలను చంపేసింది. UP, బిహార్ హిందీ హార్ట్ ల్యాండ్స్ కావు. వాటి అసలైన భాషలు ఇప్పుడు గతించిపోయాయి. భోజ్‌పురి, మైథిలీ, అవధి, బ్రాజ్, బుందేలి, గర్హ్‌వలి, కుమోని, మాగహి, మార్వాడి, మాల్వి, ఛత్తీస్‌గడి, సంతాలి, ఆంగిక, హో, ఖరియా, ఖోర్తా, కుర్మాలి, కురుఖ్, ముండారి వంటి భాషలు ఉనికి కోసం పోరాడుతున్నాయ’ని అన్నారు.
News February 27, 2025
కలియుగానికి ఇదో ఉదాహరణ..!

కన్నతల్లికి వృద్ధాప్యంలో చేయూతనిచ్చేందుకు నిరాకరించిన కొడుకుపై హరియాణా హైకోర్టు సీరియస్ అయింది. 77 ఏళ్ల తల్లికి ప్రతినెలా రూ.5000 ఇవ్వాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. దీనిపై జస్టిస్ జస్‌గుర్‌ప్రీత్ సింగ్ తీర్పునిస్తూ.. కలియుగానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 3 నెలల్లో తల్లి పేరుపై రూ.50వేలు డిపాజిట్ చేసి, ప్రతినెలా రూ.5వేలు చెల్లించాలని ఆదేశించారు.