News October 3, 2025

అమానుషం.. ప్రాణం పోతున్నా చేతులకు బేడీలు

image

బంగ్లాదేశ్ మాజీ మంత్రి నూరుల్ మాజిద్ మరణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓ కేసులో అరెస్టైన ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించగా అదే సమయంలో చేతికి బేడీలు ఉన్న ఫొటో SMలో వైరలవుతోంది. యూనస్ ప్రభుత్వం తీరు అమానుషమని అవామీ లీగ్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే పారిపోకుండా ఉండేందుకు బేడీలు వేశామని పోలీసులు చెప్పడం గమనార్హం. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు నూరుల్ సన్నిహితుడు.

Similar News

News October 3, 2025

తాజా న్యూస్

image

* TG: సికింద్రాబాద్-ఫలక్‌నుమా రైల్వే లైన్‌పై ROBని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రూ.52.03 కోట్ల వ్యయంతో 360 మీటర్ల పొడవైన నాలుగు లైన్ల బ్రిడ్జి నిర్మాణం.
* AP: పల్నాడులోని సత్తెనపల్లిలో హోటల్ సిబ్బందితో ఘర్షణ.. YCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌పై కేసు నమోదు
* వాయుగుండం బీభత్సం.. విశాఖలో 80 ప్రాంతాల్లో కూలిన చెట్లు
* వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 218/3

News October 3, 2025

రోజూ 30ని.లు నడిస్తే!

image

నడక మన ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నా చాలా మంది అడుగేయకుండా ఉన్నచోటే కూర్చుండిపోతున్నారు. కానీ రోజుకు 30 ని.లు నడిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని 35% తగ్గిస్తుంది. సెరోటోనిన్ & డోపమైన్ స్థాయులను పెంచి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యాన్ని పెంచి, జ్ఞాపకశక్తి క్షీణతను తగ్గిస్తుంది. SHARE IT

News October 3, 2025

మళ్లీ పెరగనున్న మొబైల్ టారిఫ్‌లు?

image

భారతీయ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్‌లను 10-12 శాతం వరకు పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈక్రమంలో నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇప్పటికే 1GB ప్లాన్లను తొలగించారు. సరసమైన ప్లాన్లు కనిపించట్లేదు. డేటా ప్లాన్‌లను బలవంతంగా రుద్దుతున్నారు. ధరలు భారీగా పెరిగాయి. అయినా TRAI స్పందించట్లేదు’ అని నెటిజన్లు ఫైరవుతున్నారు. మీ కామెంట్?