News February 17, 2025
అమానుషం.. చిన్నారులపై పలుమార్లు అత్యాచారం

తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 10-12ఏళ్ల లోపు ఉన్న ఇద్దరు బాలికలు, ఓ బాలుడిపై.. మరో నలుగురు బాలురు, ఓ 18 ఏళ్ల యువకుడు పలుమార్లు అత్యాచారం చేశారు. పరువు పోతుందన్న భయంతో బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు ముందుకురాలేదు. స్థానికుల ద్వారా పోలీసులకు విషయం తెలియడంతో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Similar News
News September 15, 2025
వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలి: సీఎం రేవంత్

TG: రాష్ట్రమంతటా LED వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలన్నారు. అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్ఈడీ లైట్లున్నాయని, అవి పని చేయటంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. అన్ని లైట్లను HYDలోని కమాండ్ కంట్రోల్ సెంటరుతో అనుసంధానం చేయాలని ఆదేశించారు.
News September 15, 2025
యునెస్కో జాబితాలోకి మరో 7 ఇండియన్ సైట్స్

భారత్‌లోని మరో 7 ప్రాంతాలను యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చింది.
* పంచగని&మహాబలేశ్వర్(MH) వద్ద ఉన్న దక్కన్ ట్రాప్స్
* ఉడుపి(KN)లోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ భౌగోళిక వారసత్వం
* మేఘాలయన్ ఏజ్ కేవ్స్(తూర్పు ఖాసీ కొండలు, మేఘాలయ)
* కిఫిర్(నాగాలాండ్)లోని నాగా హిల్ ఓఫియోలైట్
* వైజాగ్(AP)లోని ఎర్ర మట్టి దిబ్బల సహజ వారసత్వం
* తిరుపతి(AP)లోని తిరుమల కొండలు
* వర్కల(కేరళ) సహజ వారసత్వం
News September 15, 2025
భారత్-పాక్ మ్యాచ్.. ICCకి PCB ఫిర్యాదు

భారత్, పాక్ మధ్య నిన్నటి మ్యాచ్‌లో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తీరును ఖండిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ICCకి ఫిర్యాదు చేసింది. ఆయన క్రీడాస్ఫూర్తి రూల్స్ ఉల్లంఘించారని, తక్షణమే టోర్నీ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై స్పందించడంలో ఆలస్యం చేశారని తమ డైరెక్టర్ ఉస్మాన్‌ను సస్పెండ్ చేసింది. టాస్ సమయంలో IND కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్‌కు రిఫరీ చెప్పారని PCB ఆరోపిస్తోంది.