News July 17, 2024
యాక్సిడెంట్‌లో గాయాలు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన నవీన్ పొలిశెట్టి

తనకు అమెరికాలో జరిగిన <<12940311>>యాక్సిడెంట్‌పై<<>> జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి కీలక విషయాలు వెల్లడించారు. తన చేతికి పలుచోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయని, కాలికి గాయమైందని తెలిపారు. ‘ఇది చాలా కష్టంగా ఉంది. పూర్తిగా కోలుకునేందుకు కృషి చేస్తున్నా. మీ మద్దతు, ప్రేమ మాత్రమే నాకు అవసరమైన ఔషధం. దయచేసి నేను చెప్పేవాటినే నమ్మండి. త్వరలోనే బిగ్ స్క్రీన్‌పై అలరిస్తా’ అని పొలిశెట్టి తెలిపారు.
Similar News
News March 28, 2026
ట్రంప్-మోదీ ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్

యుద్ధం నేపథ్యంలో ఇటీవల ట్రంప్, మోదీ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ కాల్‌లో మస్క్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగే దౌత్యచర్చల్లో ఏ ప్రభుత్వ పదవిలో లేని ఒక ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం చాలా రేర్. ముఖ్యంగా గ్లోబల్ ఎనర్జీకి కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ కంట్రోల్ గురించి చర్చిస్తున్న సమయంలో మస్క్ ఉండటం చర్చనీయాంశమైంది.
News March 28, 2026
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి

ఇజ్రాయెల్ తాజా ఎయిర్ స్ట్రైక్స్‌లో ఇరాన్‌లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్, అర్దకాన్ యురేనియం ప్లాంట్‌లను టార్గెట్ చేసింది. అణ్వాయుధాల తయారీకి అవసరమైన కీలక ఇన్‌ఫ్రాను ధ్వంసం చేయడమే లక్ష్యమని IDF వెల్లడించింది. ఈ అటాక్స్‌లో ఎటువంటి ప్రాణనష్టం, రేడియేషన్ ముప్పు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.
News March 28, 2026
మార్చి 28: చరిత్రలో ఈరోజు

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం
1904: తెలుగు సినీ నటుడు చిత్తూరు నాగయ్య జననం (ఫొటోలో)
1914: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు జననం
1944: నేపథ్య గాయని బి.వసంత జననం
1948: సినీ దర్శకుడు ఐ.వి.శశి జననం
1954: నటి మూన్ మూన్ సేన్ జననం
1962: భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు కోరాడ రామకృష్ణయ్య మరణం


