News April 6, 2024
మహిళా క్రికెటర్లకు గాయాలు

పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు బిస్మా మరూఫ్, గులాం ఫాతిమాకు గాయాలయ్యాయి. కరాచీలో వారు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్కు గురైంది. ప్రస్తుతం వారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. మరూఫ్, ఫాతిమా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
Similar News
News November 22, 2025
ఇంటర్ అర్హతతో 3,058 పోస్టులు.. అప్లై చేశారా?

రైల్వేలో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్ అర్హతగల వారు ఈనెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC,ST, PwBD, మహిళలకు రూ.250. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 22, 2025
రాష్ట్రంలో 78 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 78 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS,MD,MS,DNB,PG డిగ్రీ, పీజీ డిప్లొమా, DM,M.CH,MSC, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.లక్ష నుంచి రూ.1,90,000 వరకు చెల్లిస్తారు. వెబ్సైట్: https://rajannasircilla.telangana.gov.in./
News November 22, 2025
నేడు భారీ సంఖ్యలో లొంగిపోనున్న మావోయిస్టులు

TG: మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగిలింది. ఈ రోజు 37 మంది మావోయిస్టులు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. అందులో కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులైన ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు తదితర ముఖ్య నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. మ.3 గంటలకు డీజీపీ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించనున్నారు.


