News April 4, 2025
వక్ఫ్ బిల్లుతో అన్యాయం, అవినీతి అంతం: అమిత్ షా

పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు పాస్ అవడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా Xలో స్పందించారు. ఇక అవినీతి, అన్యాయం అంతమైనట్లేనని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు న్యాయం, సమానత్వానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. ముస్లిం కమ్యూనిటీలోని పేదలు, మహిళలు, పిల్లలకు లబ్ధి కలుగుతుందన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుతో పాటు ఉభయ సభల్లో బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News April 10, 2025
చైనా వస్తువులపై అమెరికా టారిఫ్ 145%

చైనాపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు 145 శాతానికి పెరిగాయి. బుధవారం చైనా వస్తువులపై 125% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అప్పటివరకు చైనా దిగుమతులపై అమెరికా 20% టారిఫ్ విధిస్తోంది. దీంతో ఆ రెండు కలిపి అది 145 శాతానికి పెరిగింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు 70 దేశాలపై విధించిన సుంకాలను ట్రంప్ 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.
News April 10, 2025
ప్రపంచంలో తొలిసారి.. AI సాయంతో శిశువు జననం

ఏఐ అసిస్టెడ్ IVF విధానంలో ప్రపంచంలో తొలి శిశువు జన్మించింది. మెక్సికోలోని హోప్ ఐవీఎఫ్ సెంటర్లో నిపుణుల సమక్షంలో ఓ 40 ఏళ్ల మహిళ మగబిడ్డకు జన్మనిచ్చారు. అండంలోకి స్పెర్మ్ను నేరుగా ఇంజెక్ట్ చేసే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI)కు బదులు ఆటోమేటెడ్ IVF సిస్టమ్ను ఉపయోగించారు. దీని ద్వారా ICSI ప్రక్రియలోని 23 దశలు మనిషి సాయం లేకుండానే పూర్తయ్యాయి. ఈ ప్రక్రియకు 9min 56sec సమయం పట్టింది.
News April 10, 2025
కొత్తగా రూ.31,167 కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఎంతముఖ్యమో ఆ పెట్టుబడులు క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చడమూ అంతే ముఖ్యమని CM చంద్రబాబు అన్నారు. ఏదైనా ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినప్పుడే ఆ సంస్థ ఎప్పుడు ఉత్పత్తి ప్రారంభిస్తుందనే తేదీపై స్పష్టత తీసుకోవాలని అధికారులకు సూచించారు. SIPB సమావేశంలో 17 సంస్థల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటితో ₹31,167cr పెట్టుబడులు, 32,633 ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు.