News August 8, 2024
రేషన్ కార్డుల విషయంలో APకి అన్యాయం: నాదెండ్ల

రాష్ట్ర విభజన నాటి నుంచి రేషన్ కార్డుల విషయంలో APకి అన్యాయం జరుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా 2001 సెన్సెస్ ప్రకారం కేటాయింపులు చేయడంతో రేషన్ కార్డులు తగ్గిపోయాయని తెలిపారు. ప్రస్తుతం 1.47కోట్ల కుటుంబాలకు రేషన్ అందిస్తున్నామన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని లక్ష టన్నుల కందిపప్పు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఢిల్లీ పర్యటన సందర్భంగా వెల్లడించారు.
Similar News
News November 20, 2025
నాంపల్లి కోర్టులో ముగిసిన జగన్ విచారణ

HYD నాంపల్లి సీబీఐ కోర్టులో YCP అధినేత జగన్ విచారణ ముగిసింది. కోర్టులో ఆయన 5 నిమిషాలు మాత్రమే కూర్చున్నారు. వ్యక్తిగతంగా హాజరైనట్లు కోర్టు రికార్డులో నమోదు చేసింది. విచారణ అనంతరం ఆయన కోర్టు నుంచి బయటకు వచ్చారు. కాసేపట్లో లోటస్ పాండ్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు. విదేశీ పర్యటన పిటిషన్‌కు సంబంధించి జగన్ కోర్టుకు హాజరయ్యారని, ఛార్జ్షీట్లకు సంబంధించి ఎలాంటి విచారణ జరగలేదని ఆయన లాయర్ తెలిపారు.
News November 20, 2025
SAతో వన్డే సిరీస్‌కు కెప్టెన్ ఎవరు?

SAతో ODI సిరీస్‌కు IND కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. గాయాల నుంచి కోలుకుంటున్న కెప్టెన్ గిల్, VC శ్రేయస్ ఈ సిరీస్‌లో ఆడడం కష్టమే. ఈ నేపథ్యంలో KL రాహుల్ లేదా అక్షర్ పటేల్‌కు కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సుందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. గతంలో KLకు ODIsలో కెప్టెన్సీ చేసిన అనుభవముంది. ఒకవేళ అక్షర్‌కు అవకాశమిస్తే మరో కొత్త కెప్టెన్ వచ్చినట్లవుతుంది. తొలి ODI ఈనెల 30న జరగనుంది.
News November 20, 2025
iBOMMA Oneపై పోలీసుల రియాక్షన్

iBOMMA One పైరసీ వెబ్‌సైట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఆ సైట్లో కొత్త సినిమాలు పైరసీ సినిమాలు లేవని తెలిపారు. సినిమాలకు సంబంధించిన రివ్యూలు మాత్రమే ఉన్నాయని, తెరవడానికి ప్రయత్నిస్తే కూడా సైట్ ఓపెన్ కాకపోగా, ఏ ఇతర పైరసీ సైట్లకు రీడైరెక్ట్ అవ్వడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే iBOMMA, BAPPAM వంటి వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు చెప్పారు.


