News June 30, 2024
రైతులకు అన్యాయం జరిగితే సహించం: పెమ్మసాని

AP: ఖరీఫ్‌లో పంటల సాగుకు కొరత లేకుండా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షలో మాట్లాడుతూ.. కృత్రిమంగా కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా చేసే వారిపై నిఘా పెట్టాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్‌పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్‌ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్‌కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.