News March 16, 2025
గ్రూప్-1 ఫలితాల్లో వారికి అన్యాయం: కవిత

TG: గ్రూప్-1 ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న సందేహాలను ప్రభుత్వంతో పాటు TGPSC నివృత్తి చేయాలని BRS ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆమెను కలిసి చర్చించారు. పేపర్ వాల్యూయేషన్‌లో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. గ్రూప్-2 ఫలితాల్లో 13వేల మందిని ఇన్వాలిడ్‌గా ఎలా ప్రకటించిందో చెప్పాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు.
Similar News
News December 12, 2025
రాజీనామా చేయాలనుకుంటున్నా.. బంగ్లా ప్రెసిడెంట్ సంచలన కామెంట్స్

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ దేశ అధ్యక్షుడిగా తనకున్న అధికారాలను తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపిస్తున్న యూనస్ తొలగించారని షాబుద్దీన్ అన్నారు. సుమారు 7 నెలలుగా తనతో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదని చెప్పారు. అన్ని దేశాలలోని బంగ్లా రాయబార కార్యాలయాల్లో తన ఫొటోను తొలగించారన్నారు. అవమానంగా ఉందని, ఎన్నికల తర్వాత తన పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.
News December 12, 2025
నకిలీ కాఫ్ సిరప్ తయారీ.. ED సోదాలు

అక్రమ కాఫ్ సిరప్ తయారీ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసు నమోదు కావడంతో ED సోదాలు చేస్తోంది. నిందితుడు శుభమ్ జైస్వాల్, అనుచరులు అలోక్ సింగ్, అమిత్ సింగ్ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తోంది. యూపీ, ఝార్ఖండ్, గుజరాత్‌లోని 25 ప్రాంతాల్లో ఉదయం 7:30 గంటల నుంచి ఏకకాలంలో దాడులు చేస్తోంది. యూఏఈలో తలదాచుకుంటున్న జైస్వాల్‌ను భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
News December 12, 2025
జపాన్‌లో మళ్లీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌లో వరుస <<18509568>>భూకంపాలు<<>> ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇవాళ 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర పసిఫిక్ తీరప్రాంతంలో సునామీ అలలు మీటర్ ఎత్తులో ఎగసిపడొచ్చని హెచ్చరించారు. కుజి నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. కాగా నాలుగు రోజుల కిందట ఇదే ప్రాంతంలో వచ్చిన భూకంపానికి పలు ఇళ్లు బీటలు వారగా 50 మంది గాయపడ్డారు.


