News May 26, 2024
MLC ఎన్నికల్లో ఎడమ చేతి మధ్య వేలిపై సిరా

TG:వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC ఉపఎన్నికకు రేపు ఉ.8 నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 605 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేయగా.. KMM జిల్లాలో అత్యధికంగా 118, సిద్దిపేటలో అత్యల్పంగా 5 కేంద్రాలున్నాయి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలిపై వేసిన గుర్తు ఇంకా చెరిగిపోనందున ఈ ఎన్నికల్లో మధ్య వేలిపై గుర్తు చేయనున్నారు. బ్యాలెట్ పత్రాలపై ఉండే అభ్యర్థులను <<13313092>>ప్రాధాన్య<<>> క్రమంలో ఎంచుకోవాలి.
Similar News
News December 4, 2025
ENCOUNTER: 19కి చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన <<18460138>>ఎన్కౌంటర్లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 19 మంది మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో PLGA-2 కమాండర్ వెల్లా మోడియం కూడా ఉన్నారు. భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు ఎదురుకాల్పుల్లో నిన్న ముగ్గురు పోలీసులు మరణించిన విషయం తెలిసిందే.
News December 4, 2025
దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

AP: దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు ప్రకాశం, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, CTR జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు రహదారులు, తోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
News December 4, 2025
సంక్రాంతి బరిలో నెగ్గేదెవరో?

ఈసారి సంక్రాంతి బరిలోకి 7 సినిమాలు దిగనున్నాయి. ప్రభాస్ ‘రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ లిస్ట్లో ఉన్నాయి. అటు విజయ్ ‘జననాయకుడు’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ బరిలో ఉన్నాయి. పోటీలో గెలిచే ‘పందెం కోడి’ ఏదని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.


