News June 24, 2024

జనసేన పార్టీ వినూత్న నిర్ణయం

image

AP: పాలనలో తన మార్క్ చూపించేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ పార్టీ మంత్రులకు కేటాయించిన శాఖలపై ప్రజల నుంచి వినూత్నంగా సలహాలు స్వీకరించాలని నిర్ణయించింది. ‘మీలో ఎవరైనా ఈ క్రింది శాఖలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వాలంటే ఈ లింక్ ద్వారా <>గూగుల్ ఫామ్<<>> ఫిల్ చేయగలరు. ధన్యవాదాలు’ అని పోస్ట్ చేసింది. ప్రజల సలహాల్లో ఏమైనా బాగుంటే జనసేన మంత్రులు అమలు చేసే ఛాన్సుంది.

Similar News

News December 5, 2025

అందుకే IPLకు గుడ్‌బై చెప్పా: ఆండ్రీ రస్సెల్‌

image

వెస్టిండీస్‌ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్‌ IPLకు <<18429844>>గుడ్‌బై<<>> చెప్పిన కారణాన్ని తాజాగా వెల్లడించారు. “ఐపీఎల్‌ ప్రపంచంలోనే అతి పెద్ద టోర్నీ. ప్రయాణాలు, వరుస మ్యాచ్‌లు, ప్రాక్టీస్‌, జిమ్‌ వర్క్‌లోడ్‌ శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం సవాలుతో కూడుకున్నది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ నేను ప్రభావం చూపాలి. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా కొనసాగాలని అనుకోవడం లేదు” అని తెలిపారు.

News December 5, 2025

ఇండిగో ఎఫెక్ట్.. డీజీసీఏ కీలక నిర్ణయం

image

ఇండిగో సంక్షోభం నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల విధుల విషయంలో విధించిన <<18475795>>ఆంక్షలను <<>>ఎత్తివేసింది. సిబ్బంది వారాంతపు విశ్రాంతి సెలవుల నిబంధనను తొలగించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. పలు విమానయాన సంస్థల వినతి మేరకు చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయంతో ఫ్లైట్ల సర్వీసులు తిరిగి యథావిధిగా ప్రారంభం కానున్నాయి.

News December 5, 2025

‘హిల్ట్’పై హైకోర్టులో విచారణ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

image

TG: <<18450502>>హిల్ట్<<>> పాలసీపై పర్యావరణవేత్త పురుషోత్తం, ప్రజాశాంతి పార్టీ చీఫ్ KA పాల్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దీనిపై సీబీఐ లేదా ఈడీతో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.