News October 9, 2025
రిజర్వేషన్లపై విచారణ ప్రారంభం

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవోపై హైకోర్టులో విచారణ పునఃప్రారంభమైంది. నిన్న జరిగిన విచారణలో ప్రభుత్వ, పిటిషనర్ల వాదనలు విని కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ క్రమంలో ఇవాళ జరిగే విచారణపై ఉత్కంఠ నెలకొంది. అటు MPTC, ZPTCల తొలి విడత ఎన్నికలకు ఉదయం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
Similar News
News October 9, 2025
జాన్సన్ & జాన్సన్‌కు రూ.8వేల కోట్ల జరిమానా!

ఫార్మా దిగ్గజం ‘జాన్సన్ & జాన్సన్’కు టాల్కమ్ పౌడర్ సంబంధిత కేసులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పౌడర్ వాడిన 88ఏళ్ల మే మూర్ 2021లో మెసోథెలియోమా అనే అరుదైన క్యాన్సర్‌తో చనిపోయారు. బాధితురాలి కుటుంబీకులు USA కోర్టుని ఆశ్రయించగా సుదీర్ఘ విచారణ తర్వాత కంపెనీకి $966 మిలియన్ల (రూ. 8,000 కోట్లు) భారీ జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై సంస్థ అప్పీల్‌కు వెళ్లనుంది. ఇప్పటికే సంస్థపై 63వేల కేసులు నమోదయ్యాయి.
News October 9, 2025
ఇతిహాసాలు క్విజ్ – 30 సమాధానాలు

1. అశోకవనంలో సీతాదేవికి అండగా ఉండి, ధైర్యం చెప్పిన రాక్షస స్త్రీ ‘త్రిజట’.
2. శ్రీకృష్ణుడి శంఖం పేరు ‘పాంచజన్యం’.
3. భాగవతం రాయమని వేద వ్యాసుడిని ప్రేరేపించింది ‘నారదుడు’.
4. సూర్యుడి వాహనం ఏడు గుర్రాల స్వర్ణ రథం.
5. ఏకోన వింశతి: అంటే.. ఒకటి తక్కువ ఇరవై అని అర్థం. అంటే ‘19’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 9, 2025
కోర్టు కాపీ అందిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ: పొన్నం

TG: బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఇవ్వడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కోర్టు కాపీ అందిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కోర్టు స్టే విధిస్తుందని ఊహించలేదని పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కేసులో బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు ఇంప్లీడ్ కాలేదో చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు.